News


లాభంతో మొదలై క్షణాల్లో నష్టాల్లోకి...!

Thursday 13th February 2020
Markets_main1581566765.png-31740

దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు గురువారం లాభంతో మొదలై, క్షణాల్లో నష్టాల్లోకి మళ్లాయి. ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ను మెప్పించకపోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సూచీలను నష్టాల్లోకి మళ్లించాయి. సెన్సెక్స్‌ 141 పాయింట్ల లాభంతో 41,707.21 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 12,219.55 వద్ద ట్రేడింగ్‌ను మొదలయ్యాయి. అయితే బుధవారం మార్కెట్‌ ముగింపు అనంతరం వెలువడిన డిసెంబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) మైనస్‌లోకి వెళ్లిపోగా, జనవరి వినియోగ ద్రవ్యోల్బణ(సీపీఐ) ఆరేళ్ల గరిష్టాన్ని ఎగిసింది. గణాంకాలు భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఇంకా ప్రతికూల పరిస్థితులను నుంచి బయటపడలేదనే అంశాన్ని స్పష్టం చేయడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేకెత్తాయి. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాధి భయాలు మరోసారి తెరపైకి రావడంతో నేడు ఆసియా మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్లు సైతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండం సెంటిమెంట్‌ను మరింత బలహీనపరించింది. అలాగే క్రూడాయిల్‌ ధరలు పుంజుకోవడంతో దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ 6పైసలు బలహీన పడటం కూడా ఇన్వెస్టర్ల మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఉదయం గం.9:30ని.లకు ఇండెక్స్‌ 65 పాయింట్లను కోల్పోయి 41,500 వద్ద, నిఫ్టీ 21.15 పాయింట్ల నష్టంతో 12,180 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థికచ ఫైనాన్స్‌, అటో, రియల్టీ రంగ షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఫార్మా, మీడియా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ పావుశాతం నష్టంతో 31,412 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

అదానీ పోర్ట్స్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి. ఇన్ఫ్రాటెల్‌, గెయిల్‌, టైటాన్‌, ఎస్‌బీఐ, యస్‌బ్యాంక్‌ షేర్లు 3.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

200 కోట్లకు వాట్సాప్ యూజర్ల సంఖ్య

Thursday 13th February 2020

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల సంఖ్య 200 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభాలో ఇది సుమారు 25 శాతం. వాట్సాప్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. ప్రతీ వ్యక్తిగత మెసేజీకి పూర్తి స్థాయిలో గోప్యత ఉండేలా ఎప్పటికప్పుడు తమ ప్లాట్‌ఫాంను సురక్షితంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించింది. యూజర్లు పంపే, అందుకునే మెసేజీలు లేదా ఫోన్‌కాల్స్‌ను మూడో వ్యక్తి చూడటం గానీ వినడం గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ

యస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులకు పీఈ సంస్థల ఆసక్తి- షేరు జూమ్‌

Thursday 13th February 2020

4.5 శాతం జంప్‌చేసిన షేరు 14న క్యూ3 ఫలితాల విడుదల పెట్టుబడులకు 3 పీఈ సంస్థల ఆసక్తి నిధుల సమీకరణ సన్నాహాలలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలను ఈ నెల 14(శుక్రవారం)కల్లా విడుదల చేయనున్నట్లు ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌) ఫలితాలతోపాటు.. తొమ్మిది నెలల(ఏప్రిల్‌-డిసెంబర్‌) పనితీరును సైతం వెల్లడించనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు

Most from this category