News


స్వల్పలాభాలతో ప్రారంభం

Friday 13th September 2019
Markets_main1568347299.png-28340

క్రితం రోజు నష్టాల పాలైన దేశీయ మార్కెట్‌ శుక్రవారం స్వల్పలాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ కిత్రం ముగింపు(37,104)తో పోలిస్తే 73 పాయింట్ల లాభంతో 37,175.86 వద్ద, నిఫ్టీ గతముగింపు(10,983)తో పోలిస్తే 4 పాయింట్లు పెరిగి 10,987 వద్ద ప్రారంభమైంది. నిన్న నిర్వహించిన సమావేశంలో యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంక్‌(ఈసీబీ) మరో విడత ఉద్దీపన చర్యలు ప్రకటించింది. మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు బ్యాంకు నెలకు 20 బిలియన్‌ యూరోల విలువైన బాండ్లను కొనుగోలు చేయడంతో పాటు వడ్డీరేట్లను తగ్గించింది. మరోవైపు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది మధ్య-ఆదాయ గృహాలను లక్ష్యంగా చేసుకుని పన్నుల సమగ్ర ప్రణాళికను తన ప్రభుత్వం అమల్లోకి రాబోతుందనే ప్రకటనతో పాటు అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలు పురోగతి దిశగా సాగుతున్నాయనే వార్తలు సెంటిమెంట్‌కు మద్దతినిచ్చాయి. ఫలితంగా నిన్న యూరప్‌, అమెరికాలతో పాటు నేడు ఆసియా మార్కెట్లు సైతం లాభాల బాట పట్టాయి. డాలర్‌ మారకంలో రూపాయి భారీగా పుంజుకోవడం కూడా ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చింది. మీడియా, ఫార్మా రంగ షేర్లు తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లకు కొనగోళ్ల మద్దతు లభిస్తుంది. అత్యధికంగా అటో షేర్లు ఎక్కువగా లాభపడుతున్నాయి. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో 37205 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు పెరిగి 11,008.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

ఆర్థిక గణాంకాల నిరాశ!

Friday 13th September 2019

పారిశ్రామిక ఉత్పత్తి మందగమనం జూలైలో ఉత్పత్తి వృద్ధి 4.3 శాతం గత ఏడాది ఇదే నెల్లో 6.5 శాతం వృద్ధి అదుపులోనే ఉన్నా...  రిటైల్‌ ద్రవ్యోల్బణం పైకే! ఆగస్టులో 3.21 శాతం ఆహార ఉత్పత్తుల ధరలు పైకి న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గురువారం వెలువడిన కీలక గణాంకాలు నిరాశపరిచాయి. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం- జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 4.3 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 6.5

ఏ స్టాక్స్‌ను కొనాలో తెలియడం లేదా..?

Thursday 12th September 2019

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ఆగస్ట్‌లో పెట్టుబడుల రాక పెరిగింది. వరుసగా ఇది నాలుగో నెల వృద్ధి. ఒకవైపు స్టాక్‌ మార్కెట్‌ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ ఇన్వెస్టర్లు మాత్రం చలించలేదు. అయితే, నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు ప్రస్తుత మార్కెట్‌ స్పందనతో వేటిల్లో ఇన్వెస్ట్‌ చేయాలన్న దానిపై సంశయంతో ఉన్నారంటే ఆశ్చర్యం అనిపించదు. ఇటువంటి వారు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఆగస్ట్‌ నెలలో ఏ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాయి? ఏ

Most from this category