News


11050 పైన ముగిసిన నిప్టీ

Friday 13th September 2019
Markets_main1568370157.png-28359

  • 280 లాభపడ్డ సెన్సెక్స్‌
  • కలిసొచ్చిన మిడ్‌సెషన్‌ అనంతర కొనుగోళ్లు
  • రాణించిన అటో, బ్యాంకింగ్‌, ఆయిల్‌ షేర్లు

మార్కెట్‌లో మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన స్థిరమైన కొనుగోళ్లతో సూచీలు శుక్రవారం భారీ లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 280.71 పాయింట్ల లాభంతో 37,385 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 11,076 వద్ద ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో నేటి ఉదయం మార్కెట్‌ ఉత్సాహంగా ప్రారంభమైంది. అయితే నిన్న కేంద్రం ప్రకటించిన ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ను నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఈ ఉత్సాహం ఎంతోసేపు నిలువలేదు. ఫలితంగా సూచీలు మార్కెట్‌ ఆరంభంలో ఆర్జించిన లాభాల్ని పోగొట్టుకున్నాయి. అనంతరం సూచీలు మిడ్‌సెషన్‌ వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ఒకదశలో సెన్సెక్స్‌ 100 పాయింట్లను కోల్పోయి 37,000.09వద్ద, నిఫ్టీ 37 పాయింట్లను కోల్పోయి 10,945.75 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మిడ్‌సెషన్‌ నుంచి ఇన్వెస్టర్లు క్రమంగా కొనుగోళ్ల వైపు మొగ్గుచూపారు. ఆగస్ట్‌ నెలకు సంబంధించిన కీలక ఆర్థిక గణాంకాలు బలహీనంగా వున్నందున, ఆర్‌బీఐ ఆక్టోబర్‌ పాలసీ సమావేశంలో వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు మరింత మెరుగుపడటం సెంటిమెంట్‌ను బలపరిచింది. యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంక్‌(ఈసీబీ) ఉద్దీపన చర్యలు, అమెరికా చైనా వాణిజ్యయుద్ధం చల్లపడుతున్న నేపథ్యంలో నేడు ఆసియా మార్కెట్లు లాభాల ముగింపు, యూరప్‌ లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చింది. దీనికి తోడు చివరి గంటలో కొనుగోళ్లు మరింత ఉధృతం కావడంతో నిఫ్టీ 101 పాయింట్ల మేర లాభపడి 11,084.45 వద్ద, సెన్సెక్స్‌ 309 పాయింట్లు పెరిగి 37,104.28 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్‌ షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 280 పాయింట్లు పెరిగి 28,098.75 వద్ద స్థిరపడింది. 
ఇక వారం మొత్తంగా సెన్సెక్స్‌ 403 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 130 పాయింట్లు లాభపడింది. 

వేదాంత, గెయిల్‌, టైటాన్‌, ఐఓసీ, బీపీసీఎల్‌ షేర్లు 3శాతం నుంచి 6.50శాతం లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీఎయిర్‌టెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు అరశాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి. 



You may be interested

నిఫ్టీలో తదుపరి చోటు వీటికే..!

Friday 13th September 2019

బీమా రంగ స్టాక్స్‌కు ఇప్పటి వరకు నిఫ్టీలో చోటు లేదు. కానీ రానున్న సంవత్సరాల్లో బీమా రంగ కంపెనీలు తప్పకుండా నిఫ్టీలోకి వచ్చి చేరతాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణమైన సంకేతాలను, విశ్లేషణను కూడా వారు వినిపిస్తున్నారు. విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఇప్పటికే బీమా రంగ కంపెనీల భవిష్యత్తు వృద్ధి అవకాశాలను గుర్తించారు. దీనికి నిదర్శనమా అన్నట్టు.. ఈ ఏడాది ఇప్పటికే లిస్టెడ్‌ బీమా కంపెనీల్లో ఎఫ్‌పీఐలు

స్మాల్‌, మిడ్‌క్యాప్‌ల్లో ఎంట్రీకి ఇదే సరియైన సమయం!

Friday 13th September 2019

మార్కెట్‌లో పాజిటివ్‌ సెంటిమెంట్‌ తిరిగి పుంజుకున్నట్టనిపిస్తోందని, ఇలాంటి సమయంలో చాలా వరకు మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్ల వాల్యుషన్‌ ఆకర్షణీయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అన్నారు. కాగా బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 2019 లో చేరుకున్న గరిష్ఠ స్థాయి నుంచి (ప్రస్తుతానికి) 22 శాతం కన్నా అధికంగా, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 16 శాతం కన్నా అధికంగా పతనమయ్యాయి.ఈ సమయంలో సెన్సెక్స్‌ 7 శాతం నష్టయింది. ఇదే విధంగా

Most from this category