News


ఏటీఎం కార్డు లేకుండానే

Saturday 16th March 2019
news_main1552720515.png-24637

  • నగదు విత్‌డ్రా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరొక వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. యోనో యాప్‌ ద్వారా ఏటీఎం కార్డు అవసరం లేకుండానే నగదు ఉపసంహరణ సేవలను ప్రారంభించింది. ఈ మేరకు తెలంగాణ సర్కిల్‌ సీజీఎం జె.స్వామినాథన్‌ శుక్రవారమిక్కడ బ్యాంక్‌ ఆవరణలో సేవలను ప్రారంభించారు. 
16500 ఏటీఎంల్లో సేవలు...
దేశంలోని అన్ని ఎస్‌బీఐ ఏటీఎం సెంటరల్లో యోనో క్యాష్‌ సేవలను వినియోగించుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. దేశంలోని 16,500 ఏటీఎంలు యోనో క్యాష్‌ పాయింట్లుగా మారతాయని పేర్కొంది. భౌతికంగా డెబిట్‌ కార్డు లేకుండా విత్‌డ్రా సేవలను ప్రారంభించిన తొలి బ్యాంక్‌గా ఎస్‌బీఐ నిలిచిందని బ్యాంక్‌ తెలిపింది. భద్రత, సౌకర్యం పరంగా యోనో క్యాష్‌ సేవలు అంత్యంత సులభతరంగా ఉంటాయని పేర్కొంది. డిజిటల్‌ బ్యాంకింగ్‌లో భాగంగా 2017 నవంబర్‌లో ఎస్‌బీఐ యోనో యాప్‌ను ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 1.8 కోట్ల యోనో యాప్స్‌ డౌన్‌లోడ్స్‌ జరగ్గా.. ఇందులో 70 లక్షల మంది యాక్టివ్‌ యూజర్లున్నారు.
ఎలా పనిచేస్తుందంటే?
ముందుగా వినియోగదారులు యోనో యాప్‌లో కార్డ్‌లెస్‌ విత్‌డ్రా ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 6 అంకెల యోనో క్యాష్‌ పిన్‌ను సెట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత వినియోగదారునికి బ్యాంక్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబరుకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో 6 అంకెల రిఫరెన్స్‌ నంబరు వస్తుంది. యోనో క్యాష్‌ పిన్, రిఫరెన్స్‌ నంబరు రెండింటినీ ఉపయోగించి ఏటీఎం పాయింట్‌లో నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. రిఫరెన్స్‌ నంబరు వచ్చిన 30 నిమిషాల లోపు లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది.



You may be interested

బంధన్‌ బ్యాంక్‌ చేతికి గృహ్‌ ఫైనాన్స్‌ !

Saturday 16th March 2019

న్యూఢిల్లీ: బంధన్‌ బ్యాంక్‌లో గృహ్‌ ఫైనాన్స్‌ విలీనానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఆర్‌బీఐ తమకు లేఖ రాసిందని బంధన్‌  బ్యాంక్‌ తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన అందుబాటు ధరల్లో గృహాలకు రుణాలందించే గృహ్‌ ఫైనాన్స్‌ను కోల్‌కతాకు చెందిన బంధన్‌ బ్యాంక్‌ ఈ జనవరిలో టేకోవర్‌ చేసింది. షేర్ల మార్పిడి విధానంలో ఈ టేకోవర్‌ జరిగింది. ఈ డీల్‌ కారణంగా బంధన్‌ బ్యాంక్‌ ప్రమోటర్‌ బంధన్‌

పసిడిపై ఆర్‌బీఐ గురి

Saturday 16th March 2019

- బంగారం నిల్వలు పెంచుకుంటున్న రిజర్వ్‌ బ్యాంక్‌ - జనవరిలో 6.5 టన్నుల కొనుగోలు - త్వరలో నెదర్లాండ్స్‌ని దాటి పదో స్థానానికి న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధ భయాలు, రాజకీయంగా అనిశ్చితి మొదలైన పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. దేశీయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కూడా అదే బాటలో పసిడి కొనుగోళ్లు జరుపుతోంది. జనవరిలో 6.5 టన్నుల మేర పసిడి కొనుగోలు చేసింది. దీంతో ఆర్‌బీఐ వద్ద పసిడి

Most from this category