News


వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

Saturday 9th November 2019
news_main1573269518.png-29463

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిపాజిట్‌, రుణ రేట్లను తగ్గించింది. తాజా రేట్లు నవంబర్‌ 10 నుంచీ అమల్లోకి వస్తాయి. శుక్రవారం బ్యాంక్‌ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. దీనిప్రకారం...

  • నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్‌ఆర్‌) రుణ రేటు అన్ని కాలపరిమితులపై ఐదు బేసిస్‌ పాయింట్లు తగ్గింది.  బ్యాంక్‌ ఈ ఏడాది రుణరేటు తగ్గించడం ఇది వరుసగా ఏడవసారి. 
  • ఆటో, గృహ, వ్యక్తిగత రుణాలకు అనుసంధానమయ్యే ఏడాది కాల వ్యవధి రుణ రేటు 8 శాతానికి దిగి వచ్చింది. 
  • ఇక టర్మ్‌ డిపాజిట్‌ రేట్లనూ బ్యాంక్‌ తగ్గించింది.  రెండేళ్ల వరకూ రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్‌పై రేటు 15 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. బల్క్‌ టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు అన్ని కాల వ్యవధులపై 30 నుంచి 75 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గింది.  



You may be interested

జనవరి నుంచి నెఫ్ట్‌ చార్జీలకు మంగళం

Saturday 9th November 2019

వసూలు చేయరాదని ‍బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం ముంబై: వచ్చే జనవరి నుంచి సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదారులు ‘నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌’ (నెఫ్ట్‌) లావాదేవీలపై ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఆర్‌బీఐ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల మధ్య ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించి నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌ అనే రెండు ముఖ్య విధానాలు అమల్లో ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థలను ఆర్‌బీఐ నిర్వహిస్తుంటుంది. నెఫ్ట్‌

60 వేలకుపైగా వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు

Saturday 9th November 2019

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌పై  టెలికం కార్యదర్శి ప్రకటన న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌) ఎంచుకున్న బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఖ్య ఇప్పటికి 60,000 దాటింది. టెలికం సెక్రటరీ అన్‌షూ ప్రకాశ్‌ శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ విషయంలో గడచిన కొద్ది రోజుల్లో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు పెట్టుకున్న ఉద్యోగుల సంఖ్య 57,000కుపైగా ఉందని, ఎంటీఎన్‌ఎల్‌ సంబంధించి సంఖ్యను కూడా కలుపుకుంటే ఇది 60,000 దాటుతోందని ఆయన తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఒక్క శుక్రవారం

Most from this category