News


శాంసంగ్‌ లాభం 58% డౌన్‌

Tuesday 3rd December 2019
news_main1575334334.png-30011

  • 20 శాతం పెరిగిన ఆదాయం
  • వెయ్యి కోట్ల డాలర్లకు వృద్ధి  

న్యూఢిల్లీ: శాంసంగ్‌ ఇండియా కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 58 శాతం తగ్గింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,713 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,540 కోట్లకు తగ్గిందని కంపెనీల రిజిష్ట్రార్‌(ఆర్‌ఓసీ)కి శామ్‌సంగ్‌ ఇండియా వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం...,  

 60 శాతం ఆదాయం మొబైల్‌ ఫోన్లదే...
ఈ కంపెనీ మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధి చెందింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.61,066 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.73,086 కోట్లకు పెరిగింది. దీంతో భారత్‌లో 1,000 కోట్ల డాలర్ల ఆదాయ మైలురాయిని అధిగమించింది. కార్యకలాపాల ఆదాయం రూ.59,371 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ.70,628 కోట్లకు చేరింది. దీంట్లో 60 శాతం ఆదాయం (రూ.43,088 కోట్లు)మొబైల్‌ ఫోన్ల విభాగం నుంచే వచ్చింది. టీవీ, కెమెరాల విభాగం ఆదాయం రూ.5,016 కోట్లు, గృహోపకరణాల విభాగం ఆదాయం రూ.7,408 కోట్లుగా ఉన్నాయి. ఇక కంపెనీ మొత్తం వ్యయాలు రూ. 55,284 కోట్ల నుంచి 27% వృద్ధితో రూ.70,228 కోట్లకు పెరిగింది. వడ్డీ భారం రూ.711 కోట్ల నుంచి రూ.1,059 కోట్లకు ఎగసింది.  



You may be interested

వాల్‌మార్ట్‌తో కలిసి... హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డులు

Tuesday 3rd December 2019

గ్రోసరీ దిగ్గజం కస్టమర్లకు 50 రోజుల ఉచిత క్రెడిట్‌   హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హెచ్‌డీఎఫ్‌సీ భాగస్వామ్యంతో వాల్‌మార్డ్‌ ఇండియా తన కస్టమర్ల కోసం కో–బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను విడుదల చేసింది. వాల్‌మార్ట్‌ తాలూకు బెస్ట్‌ప్రైస్‌ హోల్‌సేల్‌ క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్ల సభ్యుల కోసం ఈ కార్డులను విడుదల చేస్తున్నట్లు వాల్‌మార్ట్‌ ఇండియా సీఈఓ క్రిష్‌ అయ్యర్‌ చెప్పారు. వీటితో కస్టమర్లకు 18– 50 రోజుల ఫ్రీ క్రెడిట్‌ లభిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా

ఆ మాటలతో.. దేశ ప్రయోజనాలకు విఘాతం

Tuesday 3rd December 2019

రాహుల్‌ బజాజ్‌ విమర్శలపై ఆర్థిక మంత్రి నిర్మల వ్యాఖ్య న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనే దమ్ము లేకుండా పోయిందంటూ వ్యాపార దిగ్గజం రాహుల్‌ బజాజ్‌ చేసిన విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. తమ సొంత అభిప్రాయాలను అందరికీ ఆపాదించడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు.  ఇలాంటి విమర్శలు .. జాతి ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రులు పీయూష్‌

Most from this category