News


ఇన్వెస్ట్‌మెంట్స్‌కు వినియోగ రంగాలే భేష్‌

Friday 14th February 2020
Markets_main1581672786.png-31796

లార్జ్‌ క్యాప్స్‌, మిడ్‌ క్యాప్స్‌ అంతరం తగ్గనుంది
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రియల్టీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఓకే
ఇకపై ఆర్థిక వృద్ధి ఊపందుకుంటుంది
- పంకజ్‌ బొబాడే, ఫండమెంటల్‌ రీసెర్చ్‌ హెడ్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌

బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం, పాలసీ సమీక్షలో రిజర్వ్‌​బ్యాంక్‌ చేసిన ప్రతిపాదనలు ఆర్థిక పురోగతికి దోహదం చేయనున్నాయి. దీంతో మధ్య, దీర్ఘకాలాలలో స్టాక్‌ మార్కెట్లు పుంజుకుంటాయని విశ్వసిస్తున్నట్లు యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ పంకజ్‌ బొబాడే చెబుతున్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనలు, మార్కెమార్కెట్లతోపాటు, వివిధ రంగాలపై ఒక ఇంటర్వ్యూలో పంకజ్‌ పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం...

ఫలితాలు గుడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలు అంచనాలను మించాయి. ఇందుకు కొంతవరకూ కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు దోహదపడింది. ఇకపై కార్పొరేట్‌ పనితీరు మరింత మెరుగుపడే వీలుంది. జీడీపీ వృద్ధి వేగమందుకుంటే వినియోగ రంగం మరింత జోరందుకుంటుంది. రబీ పంటలు, గ్రామీణ ఆదాయాలకు బడ్జెట్‌ పుష్‌ వంటివి ఇందుకు సహకరించే వీలుంది. అయితే చైనాలో తలెత్తిన కరోనా వైరస్‌ కారణంగా కొన్ని పరిశ్రమల్లో సరఫరాలకు విఘాతం కలుగుతోంది. ఇవి స్వల్పకాలమే. కంపెనీలు ప్రత్యామ్నాయాలను వెదుక్కుంటాయి. దీంతో దేశీ కంపెనీలకు అవకాశాలు మెరుగుపడనున్నాయి. ప్రధానంగా సిరామిక్స్‌, హోమ్‌వేర్‌, ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ గూడ్స్‌, టెక్స్‌టైల్స్‌ లాభపడే అవకాశముంది.

ఈ రంగాలు మేలు
బడ్జెట్‌, ఆర్‌బీఐ చర్యల నేపథ్యంలో వ్యవసాయం, గ్రామీణ ఎకానమీ, మౌలిక సదుపాయాలు, రియల్‌ ఎస్టేట్‌, ఎంఎస్‌ఎంఈ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగాలు లబ్ది పొందనున్నాయి. ఈ రంగాలలో నాణ్యమైన కంపెనీలను పెట్టుబడుల కోసం ఎంపిక చేసుకోవచ్చు. కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం తలెత్తిన అనిశ్చితిలో దేశీ వినియోగ రంగాలపై దృష్టిపెట్టడం మేలు. చైనా సరఫరాలపై అధికంగా ఆధారపడే కమొడిటీలు తదితర రంగాలను ప్రస్తుతానికి  వొదిలిపెట్టవచ్చు. స్వల్పకాలానికి మార్కెట్ల నడకను అంచనా వేయలేం. అయితే మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో నాణ్యమైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. లాభాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి సాధిస్తూ.. చౌకగా లభించే చిన్న షేర్లపై దృష్టిపెట్టవచ్చు. కొంతకాలానికి ఇలాంటి స్టాక్స్‌వల్ల లార్జ్‌ క్యా‍ప్స్, మిడ్‌ క్యాప్స్‌ మధ్య వ్యత్యాసం తగ్గుముఖం పడుతుంది.

వడ్డీ రేట్లు తగ్గవచ్చు
ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌.. ఏడాది, మూడేళ్ల కాలావధితో రివర్స్‌ రెపో విండోను కల్పించడం ద్వారా బ్యాంకులకు భారీగా నిధులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో లిక్విడిటీని బాగా పెంచింది. వెరసి ఇకపై బ్యాంకులు రెపో రేట్లలో కోతలను కస్టమర్లకు బదిలీ చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. దీర్ఘకాలంలో బ్యాంకులు చౌకగా నిధులు సమకూర్చుకునేందుకు వీలు కలగనుంది. డిపాజిట్లు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులకు ఆర్‌బీఐ చర్యలు బూస్ట్‌నిచ్చే వీలుంది. దాదాపు రూ. లక్ష కోట్లను బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి విడుదల చేయడం ద్వారా ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు బ్యాంకులపై ఒత్తిడి పెంచింది. ఫలితంగా ఇటీవల చేపట్టిన రెపో రేట్ల కోత ప్రయోజనాలను బ్యాంకులు వినియోగదారులకు  చేరవేసేందుకు ఆర్‌బీఐ దారి చూపుతోంది.  You may be interested

లార్జ్‌క్యాప్స్‌పైనే నమ్మకం!

Friday 14th February 2020

ఆండ్రూ హోలండ్‌ దేశీయ మార్కెట్లో రంగాలవారీగా పెద్ద కంపెనీల షేర్లపైనే నమ్మకం ఉంచుతున్నట్లు అవెండాస్‌ క్యాపిటల్‌ సీఈఓ ఆండ్రూహోలండ్‌ చెప్పారు. బడ్జెట్‌ ఓకే అని, ఎకానమీని పునరుజ్జీవం చెందించేందుకు ఆర్‌బీఐ భారీ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మార్చిచివరకు ప్రభుత్వం, ఆర్‌బీఐ చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తేలిపోతుందన్నారు. ప్రభుత్వం కన్నా ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు ఎకానమీకి మంచి ప్రయోజనం చేకూరుస్తాయని, కాకపోతే ఇందుకు సమయం పడుతుందని తెలిపారు. విత్తలోటు పెరుగుతుందనే భయాలతో

ఫేస్‌మాస్క్‌లకు భారీగా పెరిగిన డిమాండ్‌

Friday 14th February 2020

కోవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వ్యాపారాలు దెబ్బతింటే మరికొన్ని లాభపడ్డాయి. వాటిలో శానిటైజర్స్‌, ఫేస్‌మాస్కులు విక్రయించే ఫ్మార్మా కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో కోవిడ్‌-19 భయంతో అధిక సంఖ్యలో వినియోగదారులు ఫేస్‌మాస్కులు కొనుగోలు చేశారు. ఈ నాలుగు నగరాల్లో ఇప్పటికే ఫేస్‌మాస్క్‌లు నిల్వలు అయిపోయాయి. మరికొన్ని వారాల్లో శానిటైజర్స్‌ కూడా అయిపోతాయని చెబుతూ.. ‘‘ఆల్‌ ఫుడ్‌ అండ్‌

Most from this category