News


వేగంగా రూపాయి రికవరీ !

Saturday 16th March 2019
Markets_main1552719314.png-24634

- శుక్రవారం 24 పైసలు బలోపేతం
- 69.10కి పరుగు
- వరుసగా ఐదవరోజు లాభాల బాట
- 104 పైసల పురోగమనం

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ గడచిన ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో వేగంగా బలపడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో శుక్రవారం 24పైసలు లాభపడితే, గడచిన ఐదు రోజుల్లో 104 పైసలు బలపడింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ రూపాయి లాభాల బాటన నడిచింది. గురువారం ముగింపు 69.34పైసలు అయితే, శుక్రవారం మరింత లాభంతో 69.28 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో 69.03ను స్థాయిని కూడా చూసింది. 

కారణాలు ఇవీ...
- ఎన్నికల అనంతరం దేశ ప్రధానిగా మళ్లీ నరేంద్రమోదీనే పగ్గాలు చేపడతారన్న విశ్లేషణలు
-  ఈ అంచనాల నేపథ్యంలో డెట్‌, ఈక్విటీ మార్కెట్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ‍ప్రవాహం.
- క్రూడ్‌ ఆయిల్ (ఈ వార్త రాసే 9 గంటల సమయంలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 66.68)  ధరలు అంతర్జాతీయంగా స్థిరంగా ఉండడం.
- దీనితో ద్రవ్యోల్బణం ‍కట్టడిలో ఉంటుందన్న విశ్లేషణలు.
- వృద్ధి క్రియాశీలతకు రేటు తగ్గింపు ఉంటుందన్న అంచనాలు.
- డాలర్‌ ఇండెక్స్‌ కదలికలపై అనిశ్చితి (ఈ వార్త రాసే 9 గంటల సమయంలో 96.50)
- అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌- రేటు (ప్రస్తుత శ్రేణి 2.25-2.50) పెంపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందన్న అభిప్రాయం.
- మూడేళ్ల ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ స్వాప్‌ ఆక‌్షన్‌ ద్వారా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఐదు బిలియన్‌ డాలర్ల లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) వ్యవస్థలోకి పంప్‌ చేస్తోందన్న వార్త.

74.39 కనిష్టం నుంచి...
అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్‌ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 13 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72-70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమవుతోంది. అయితే క్రూడ్‌ ధరల  కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 



You may be interested

2022 నాటికి రూ.2,500 కోట్లకు టర్నోవర్‌

Saturday 16th March 2019

ప్రీఫ్యాబ్‌ వ్యాపారంలోకి మళ్లీ వస్తాం బిల్డింగ్‌ మెటీరియల్స్‌లో విస్తరిస్తాం ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ కె.రవి సిమెంట్‌, రెడీ మిక్స్‌ కాంక్రీట్‌, బోర్డ్స్‌, ఎనర్జీ వంటి వ్యాపారాల్లో ఉన్న ఎన్‌సీఎల్‌ గ్రూప్‌ 2022 నాటికి రూ.2,500 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా చేసుకుంది. ఇందులో లిస్టెడ్‌ కంపెనీ అయిన ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ వాటా రూ.2,000 కోట్లుండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్‌ టర్నోవర్‌ రూ.1,850 కోట్లు నమోదు చేయబోతోంది. ఈ టర్నోవరులో రూ.1,450 కోట్లు ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌

ఫిబ్రవరిలో తగ్గిన వాణిజ్యలోటు

Saturday 16th March 2019

- ఎగుమతుల విలువ  26.67 బిలియన్‌ డాలర్లు - దిగుమతుల విషయంలో ఈ మొత్తం 36.26 బిలియన్‌ డాలర్లు - వెరసి వాణిజ్యలోటు  9.6 బిలియన్‌ డాలర్లు న్యూఢిల్లీ: ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు ఫిబ్రవరిలో ఉపశమించింది. దిగుమతులు తగ్గడం దీనికి ప్రధాన కారణం. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... - ఎగుమతుల విలువ 2.44 శాతం పెరుగుదలతో 26.67 బిలియన్‌ డాలర్లు.  ఫార్మా, ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌  ఎగుమతులు పెరిగాయి.  - దిగుమతుల విషయంలో ఈ

Most from this category