News


70.96 వద్ద ప్రారంభమైన రూపీ

Friday 13th September 2019
Markets_main1568351043.png-28349

తాజాగా విదేశి నిధుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండడం, చమురు ధరలు పడిపోవడంతో పాటు, యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌ వార్‌ కొంత సరళతరం అవ్వడం, చైనా కరెన్సీ బలపడడం వంటి కారణాల వలన రూపీ డాలర్‌ మారకంలో గత కొన్ని సెషన్‌ల నుంచి బలపడుతోంది. రూపీ... డాలర్‌ మారకంలో శుక్రవారం ట్రేడింగ్‌లో 18 పైసలు బలపడి 70.96 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్‌లో డాలర్‌ మారకంలో  52 పైసలు బలపడి 71.14 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. దీంతో రూపీ వరుసగా ఆరు సెషన్‌లలో డాలర్‌ మారకంలో బలపడినట్టయ్యింది. మొత్తంగా ఈ ఆరు సెషన్‌లలో రూపీ డాలర్‌ మారకంలో 125 పైసలు బలపడడడం గమనార్హం. రూపీ డాలర్‌ మారకంలో శుక్రవారం ట్రేడింగ్‌లో ఉదయం 10.20 సమయానికి 70.95 వద్ద ట్రేడవుతోంది.  



You may be interested

దిగివచ్చిన పసిడి

Friday 13th September 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర దిగివచ్చింది. ఆసియాలో శుక్రవారం ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు నష్టపోయి 1,503.20 వద్ద స్థిరపడింది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలు పురోగతి సాధిస్తున్నట్లు సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు రిస్క్‌ అసెట్‌ సాధనమైన ఈక్విటీ షేర్లలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. ‘‘వచ్చే నెలలో అమెరికా చైనాల మధ్య  మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో ఇప్పటికే శాంతి పూర్వక వాతావరణ నెలకొనడం శుభపరిణామం.ఇరుదేశాల మధ్య వేడిక్కిన వాణిజ్య యుద్ధ

తగ్గిన చమురు

Friday 13th September 2019

యుఎస్-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుధ్దం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు తగ్గుతుండడంతో శుక్రవారం చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్‌ 17 సెంట్లు లేదా 0.3 శాతం క్షీణించి బ్యారెల్‌ 60.21 డాలర్లకు చేరుకుంది. అదే విధంగా డబ్ల్యుటీఐ క్రూడ్‌ 14 సెంట్లు లేదా 0.3 శాతం తగ్గి బ్యారెల్‌ 54.95 డాలర్లకు చేరుకుంది.    ‘యుఎస్‌, చైనా మధ్య వివాదం ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. అంతేకాకుండా ఆర్గనైజేషన్

Most from this category