News


24 పైసలు బలపడిన రూపీ

Friday 11th October 2019
Markets_main1570771525.png-28821

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో శుక్రవారం ట్రేడింగ్‌లో 24 పైసలు బలపడి 70.83 వద్ద ప్రారంభమైంది. అంతేకాకుండా ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బలహీనపడడంతో రూపీ డాలర్‌ మారకంలో 70.81 వద్ద ఒక వారం గరిష్ఠాన్ని తాకింది. కాగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 71.07 వద్ద ముగిసింది.
   యురోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ ఎక్సిట్‌ ఒప్పందంపై పురోగతి ఉండడంతో పాటు యుఎస్‌-చైనా మధ్య గురువారం ప్రారంభమైన వాణిజ్య చర్చలు బాగా జరిగాయని యుఎస్‌ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం  పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. 
   దేశీయ మార్కెట్లో నెగిటివ్‌ సెంటిమెంట్‌ ఉండడంతో అక్టోబర్‌లో రూపీ డాలర్‌ మారకంలో ‍ప్రతికూలంగా కదలవచ్చని బ్రోకరేజీ సంస్థ షేర్‌ఖాన్‌ పేర్కొంది. ‘యుఎస్‌-చైనా, యుఎస్‌-ఈయూ మధ్య పెరుగుతున్న వాణిజ్య ఒత్తిళ్లు, ఆర్థిక మందగమన ఆందోళనలు, పెరుగుతున్న మధ్యప్రాచ్య ఒత్తిళ్లు వలన మార్కెట్‌ సెంటిమెంట్‌ ప్రతికూలంగా ఉంది. వీటితో పాటు ఎఫ్‌ఐఐల(విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) ఔట్‌ఫ్లో కొనసాగుతుండడం వలన రూపీ డాలర్‌ మారకంలో బలహీనపడే అవకాశం ఉంది. సమీప కాలంలో రూపీ-డాలర్‌ మారకంలో 70.0-71.80 పరిధిలో కదలాడే అవకాశం ఉంది’ అని ఈ బ్రోకరేజి తెలిపింది.

 



You may be interested

టీసీఎస్‌ 2% డౌన్‌, మిశ్రమంగా ఐటీ షేర్లు!

Friday 11th October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నప్పటికి, టీసీఎస్‌ క్యూ2 ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోవడం, రూపీ డాలర్‌ మారకంలో బలపడడంతో శుక్రవారం ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు మిశ్రమంగా ట్రేడవతున్నాయి. ఉదయం 11.10 సమయానికి నిప్టీ ఐటీ ఇండెక్స్‌​0.12 శాతం లాభపడి 15,112.25 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన ఇన్ఫోసిస్‌ 2.20 శాతం లాభపడి రూ. 800.25 వద్ద ట్రేడవుతుండగా, ఫలితాల ప్రభావంతో టీసీఎస్‌ 2.66

1,500 డాలర్ల దిగువకు బంగారం!

Friday 11th October 2019

యుఎస్‌-చైనా ప్రతినిధుల మధ్య గురువారం ప్రారంభమైన వాణిజ్య చర్చలు బాగా జరిగాయని ట్రంప్‌ ట్వీట్‌ చేయడంతో శుక్రవారం ట్రేడింగ్‌లో బంగారం ధరలు తగ్గాయి. తక్షణ బంగారం 0.2 శాతం తగ్గి 1,491.12 డాలర్లకు చేరుకోగా, యుఎస్‌ గోల్డ్‌ ప్యూచర్స్‌ 0.2 శాతం నష్టపోయి 1,498.50 డాలర్లకు చేరుకుంది.    యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు బాగా జరిగాయని ట్రంప్‌ గురువారం ట్వీట్‌  చేశారు. ఫలితంగా ఇరు దేశాల మధ్య గత

Most from this category