News


71.43 వద్ద రూపీ ప్రారంభం​

Thursday 12th September 2019
Markets_main1568265436.png-28331

ఆసియా ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతుండడం, ప్రపంచ ముడి చమురు ధరలు పెరుగుదల మధ్య రూపీ డాలర్‌ మారకంలో గురువారం 23 పైసలు బలపడి 71.43 వద్ద ప్రారంభమైంది. కానీ కొద్ది సమయంలోనే రూపీ డాలర్‌మారకంలో 30 పైసలు కొల్పోయి ట్రేడవుతోంది. దేశియ ఈక్విటీ మార్కెట్లు, చైనా కరెన్సీ యువాన్‌ బలపడడంతో బుధవారం రూపీ డాలర్‌ మారకంలో 5 పైసలు బలపడి 71.66 వద్ద స్థిరపడింది. 
   దేశీయ స్టాక్‌మార్కెట్లలో పెరుగుదల ఇన్వెస్టర్లను ఉత్సాహపరిచిందని, ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. కాగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) సోమవారం రూ .188.08 కోట్లను దేశియ మార్కెట్‌ల నుంచి ఉపసంహరించుకున్నారని ప్రావిజినల్‌ ఎక్సేంజ్‌ డేటా పేర్కొంది. 
    యుఎస్-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఘర్షణలు తగ్గుతాయనే అంచనాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్ వెలుపల ఆసియా-పసిఫిక్ షేర్ల ఎంఎస్‌సీఐ  విస్తృత సూచీ 0.2 శాతం, జపాన్ నిక్కీ స్టాక్ ఇండెక్స్ 1 శాతం పెరిగాయి. ఆస్ట్రేలియా షేర్లు 0.41 శాతం పెరిగాయి.



You may be interested

నిఫ్టీ 11,042ను దాటింది... తర్వాత ఎటు?

Thursday 12th September 2019

స్టాక్‌ మార్కెట్లు ఈ వారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50 11,000 స్థాయికి పైన ప్రారంభమవ్వగా, ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 37,000 పాయింట్ల స్థాయిని అధిగమించింది. నిఫ్టీ తన 5, 13, 20-రోజుల ఈఎంఏ(ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజ్‌) సగటుల కంటే పైన ట్రేడవుతోంది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.97 శాతం, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.92 శాతం పెరిగాయి. నిఫ్టీ 50 తన కీలక నిరోధ స్థాయి

పెరిగిన చమురు

Thursday 12th September 2019

యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌ సరళతరం అవ్వడంతోపాటు, యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే తగ్గడంతో గురువారం ట్రేడింగ్‌లో చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.7 శాతం పెరిగి బారెల్‌ 61.22 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 0.7 శాతం పెరిగి బారెల్‌ 56.16 డాలర్లకు చేరుకుంది.    యుఎస్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని యాంటీ క్యాన్సర్‌ డ్రగ్స్‌పై తాజాగా విధించిన సుంకాలను చైనా మినహాయించింది. అదే విధంగా చైనా

Most from this category