News


మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.500 కోట్లు తక్కువే: ధీరేంద్ర

Saturday 9th November 2019
personal-finance_main1573240670.png-29461

మిడ్‌క్యాప్‌లు చౌకగా ఉన్నాయనే అభిప్రాయం పెరుగుతోంది. లార్జ్‌క్యాప్‌లు అధిక న్యాత కలిగినవని, అదే సమయంలో ఖరీదుగా ఉంటాయనే అభిప్రాయం కూడా పెరుగుతోంది. దీర్ఘకాలానికి లాభాలు పొందాలంటే ఈ విధమైన ఆలోచన సరికాదు’’అని వ్యాల్యూరీసెర్చ్‌ సంస్థ సీఈవో ధీరేంద్ర కుమార్‌ అన్నారు. అక్టోబర్‌ నెలకు సంబంధించి మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులపై తన అభిప్రాయాలను ఆయన ఓ వార్తా సంస్థకు తెలియజేశారు.

 

మిడ్‌క్యాప్స్‌లోకి రూ.500 కోట్లే పెట్టుబడులు వచ్చాయి. కేవలం లార్జ్‌క్యాప్స్‌ మాత్రమే ఆకర్షణీయంగా కనిపించే దశలోనే ఉన్నామా??
అవును. మంచిగా పనితీరు చూపించే వాటి వెంటే ఇన్వెస్టర్లు పరుగెడుతుంటారు. వచ్చిన పెట్టుబడుల ప్రవాహాన్ని చూస్తే మిడ్‌క్యాప్స్‌లోకి రూ.500 కోట్లు అంటే పెద్ద మొత్తమేమీ కాదు. కానీ, మిడ్‌క్యాప్స్‌ మాత్రం గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. మిడ్‌క్యాప్స్‌ చౌకగా ఉన్నాయనే అభిప్రాయం పెరుగుతోంది. అఆగే, లార్జ్‌క్యాప్స్‌ నాణ్యమైనవని, మంచి కంపెనీలు ఖరీదుగా ఉంటాయనే అభిప్రాయం కూడా వృద్ధి చెందుతోంది. నిజానికి దీర్ఘకాలంలో మార్కెట్లో లాభాల కోసం అనుసరించే మార్గం ఇది కాదు. మార్కెట్లో సమయమే అన్న అభిప్రాయం కూడా ఉంది. కానీ, మెజారిటీ ఇన్వెస్టర్లు భిన్నంగానే వ్యవహరిస్తుంటారు. మంచిగా పనితీరు చూపించే వాటిని చేధించడంతోపాటు, ఇలా పనితీరు చూపించని వాటికి లేదా ఇటీవలే తాము నష్టపోయిన స్టాక్స్‌కు దూరంగా ఉంటున్నారు. 

 

హైబ్రిడ్‌ ఫండ్స్‌ నుంచి గత కొన్ని నెలల్లో రూ.2,000 కోట్లు బటయకు వెళ్లిపోయాయి. ఇన్వెస్టర్లు ఈ విభాగానికి దూరంగా ఉంటున్నారా?
కాదు. హైబ్రిడ్‌ విభాగం పెట్టుబడులను కోల్పోవడానికి కారణం తెలియదు. బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ నుంచి లేదా ఈక్విటీ ఇన్‌కమ్‌ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్టర్లు బయటకు వెళ్లిపోడానికి గల స్పష్టమైన కారణం ఏదీ చూడలేదు. కానీ హైబ్రిడ్‌ విభాగం ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉంది. ఈక్విటీ, డెట్‌ కలయికతో మంచి ప్యాకేజీనిస్తోంది. స్థిరమైన వృద్ధికి అవకాశం ఇస్తోంది. అయితే హైబ్రిడ్‌ ఫండ్స్‌ వేగంగా పెరగవు. చార్ట్‌ల్లో అవి అగ్ర స్థానంలో ఉండవు. అదే సమయంలో కనిష్టంలోనూ ఉండవు. ఇదే అయి ఉంటుందేమోనని అనిపిస్తోంది. కొత్త ఇన్వెస్టర్‌ ఎవరైనా హైబ్రిడ్‌ ఫండ్‌తోనే మొదలు పెట్టాలి. ఎన్నో బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ అధిక డివిడెండ్‌ ఈల్డ్‌పై కొన్ని సంవత్సరాల క్రితం విక్రియంచడం జరిగింది. మార్కెట్ల అస్థిరతలతో ఈ డివిడెండ్‌ తగ్గిపోయింది. చాలా మంది ఇన్వెస్టర్లు దీని కోసమే కొనుగోలు చేసి ఉంటారేమోనని మరో కారణంగా అనిపిస్తోంది.



You may be interested

60 వేలకుపైగా వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు

Saturday 9th November 2019

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌పై  టెలికం కార్యదర్శి ప్రకటన న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌) ఎంచుకున్న బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఖ్య ఇప్పటికి 60,000 దాటింది. టెలికం సెక్రటరీ అన్‌షూ ప్రకాశ్‌ శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ విషయంలో గడచిన కొద్ది రోజుల్లో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు పెట్టుకున్న ఉద్యోగుల సంఖ్య 57,000కుపైగా ఉందని, ఎంటీఎన్‌ఎల్‌ సంబంధించి సంఖ్యను కూడా కలుపుకుంటే ఇది 60,000 దాటుతోందని ఆయన తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఒక్క శుక్రవారం

బేర్స్‌ పట్టులోకి వెళ్లినట్టేనా..?

Saturday 9th November 2019

కీలకమైన 12,000 మార్క్‌పైన నిఫ్టీ క్లోజయిన మరుసటి రోజే దాన్ని కోల్పోయింది. శుక్రవారం నిఫ్టీ సూచీ 104 పాయింట్లు నష్టపోయి 11,908 వద్ద క్లోజయింది. అంతేకాదు 12,000 దిగువన మద్దతు స్థాయి 11,946ను కూడా కోల్పోయింది. దీంతో బేర్స్‌దే మరోసారి పైచేయిగా కనిపించింది. దీనిపై నిపుణుల అభిప్రాయాలు చూద్దాం..   ఇండెక్స్‌ అనిశ్చయ క్యాండిల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. శుక్రవారం డైలీ చార్ట్‌లో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. ఐదు రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌

Most from this category