News


రూ.4.91 లక్షల కోట్ల రుణ పంపిణీ

Wednesday 4th December 2019
news_main1575431098.png-30039

  • అక్టోబర్‌, నవంబర్‌లలో
  • ప్రభుత్వ బ్యాంకింగ్‌ గణాంకాలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు అక్టోబర్‌, నవంబర్‌లలో రూ.4.91 లక్షల కోట్ల రికార్డు స్థాయి రుణ పంపిణీలు జరిపాయి.  వినియోగం పెంపు, ఆర్థిక వృద్ధి పునరుత్తేజం లక్ష్యంగా రుణ వృద్ధి మెరుగుపడాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో ఈ గణాంకాలు వెలువడ్డాయి. బ్యాంకులు వినియోగదారులను చేరుకోవాలని, వారి అవసరాలకు అనుగుణంగా తగిన అన్ని నిబంధనలూ అనుసరించి రుణ పంపిణీలు జరగాలనీ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సెప్టెంబర్‌లో బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. ఆర్థికవృద్ధిలో ఇది కీలక అంశమని తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు నెలల్లో బ్యాంకులు దేశ వ్యాప్తంగా 374 జిల్లాల్లో ప్రత్యేక రుణ మేళాలు నిర్వహించాయి. ప్రత్యేకించి రుణ పంపిణీల విషయంలో లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, కార్పొరేట్లు, రిటైల్‌, వ్యవసాయ విభాగాలపై దృష్టిపెట్టాయి. రుణ పంపిణీలకు సంబంధించి నిబంధనల్లో ఏ మాత్రం రాజీ పడలేదని మంగళవారం గణాంకాల విడుదల సందర్భంగా ఆర్థికమంత్రిత్వశాఖ పేర్కొంది. అక్టోబర్‌లో రూ.2.52 లక్షల కోట్లు, నవంబర్‌లో రూ.2.39 లక్షల కోట్ల రుణ పంపిణీలు జరిగినట్లు వివరించింది.  రెండు నెలల్లో ప్రత్యేకించి ఎంఎస్‌ఎంఈలకు రూ.72,985 కోట్లు, కార్పొరేట్లకు రూ.2.2 లక్షల కోట్ల రుణ పంపిణీలు జరిగినట్లు తెలిపింది. రూ.27,225 కోట్ల గృహ రుణాలు మంజూరు అయ్యాయి. వాహన రుణాల విలువ రూ.11,088 కోట్లుగా ఉంది. విద్యకు సంబంధించి ఈ మొత్తం రూ.1,111 కోట్లు. వ్యవసాయ రుణాలు రూ.78,374 కోట్లు. 



You may be interested

ఇక షావోమి... వ్యక్తిగత రుణాలు

Wednesday 4th December 2019

యాప్‌ ఆధారంగా రుణాలు ‘మీ క్రెడిట్‌’ పేరిట యాప్‌ విడుదల రూ. లక్ష వరకు లోన్‌ న్యూఢిల్లీ: చైనాకు చెందిన షావోమీ.. భారత్‌లో రుణ మంజూరీ సేవలను ప్రారంభించింది. ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఇక్కడ మార్కెట్‌కు సుపరిచితమైన ఈ సంస్థ.. మొబైల్‌ అప్లికేషన్‌ ఆధారంగా వ్యక్తిగత రుణాలను ఇవ్వనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇందుకోసం ‘మీ క్రెడిట్‌’ పేరిట యాప్‌ను అందుబాటులో ఉంచింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని రూ. లక్ష వరకు

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లో ముగిసిన వీఆర్‌ఎస్‌

Wednesday 4th December 2019

స్కీమ్ ఎంచుకున్న 92,700 మంది ఉద్యోగులు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకం మంగళవారంతో ముగిసింది. రెండు సంస్థల్లో 92,700 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్ ఎంచుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌లో 78,300 మంది, ఎంటీఎన్‌ఎల్‌లో 14,378 మంది దీన్ని ఎంచుకున్నారు. "ఊహించిన స్థాయిలోనే ఇది ఉంది. మేం సుమారు 82,000 మేర సిబ్బంది సంఖ్య తగ్గుతుందని భావించాం. 78,300 మంది

Most from this category