News


హైదరాబాద్‌ రియల్టీలోకి 10,100 కోట్ల పెట్టుబడులు

Thursday 15th August 2019
Markets_main1565850820.png-27772

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు హైదరాబాద్‌ అభివృద్ధికి చోదకశక్తిగా మారింది. 2015లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2019 తొలి ఆర్ధ సంవత్సరం వరకూ  హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం 10,100 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 2008–14 మధ్యకాలంలో ఇది రూ.1,800 కోట్లుగా ఉందని జోన్స్‌ లాంగ్‌ లాసెల్లె (జేఎల్‌ఎల్‌) తెలిపింది. ఇందులోనూ 70 శాతం పెట్టుబడులు కార్యాలయాల విభాగమే ఆకర్షించిందని పేర్కొంది. బుధవారమిక్కడ జేఎల్‌ఎల్‌ కొత్త ఆఫీసు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌లతో పాటూ  జేఎల్‌ఎల్‌ ఇండియా సీఈఓ రమేష్‌ నాయర్, హైదరాబాద్‌ ఎండీ సందీప్‌ పట్నాయక్‌ పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా రమేష్‌ నాయర్‌ మాట్లాడుతూ.. బలమైన ఆర్ధిక వృద్ధి, మౌలిక రంగం, ప్రపంచ స్థాయి కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహకాలు తదితరాల వల్ల ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల మీద సానుకూల ప్రభావం చూపిస్తుందని తెలిపారు. కో–వర్కింగ్‌ కంపెనీలు, బీఎఫ్‌ఎస్‌ఐ, ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీల విస్తరణ హైదరాబాద్‌ అభివృద్ధికి ముఖ్య కారణమని పేర్కొన్నారు.
కొత్త ప్రాజెక్ట్‌ల్లో తగ్గుముఖం..
ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరం నాటికి నగరంలో 13.2 మిలియన్‌ చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. ఇందులో 50–60 శాతం స్పేస్‌ అప్పటికే ఆక్యుపై అయిందని జేఎల్‌ఎల్‌ నివేదిక తెలిపింది. నివాస విభాగంలో కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభాలు తగ్గుముఖం పట్టాయి. పుప్పాలగూడ, గోపనపల్లి, మణికొండ, నార్సింగి, నల్లగండ్ల ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. 40 శాతం ప్రాజెక్ట్‌లు రూ.75 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉన్నాయి. ఈ ఏడాది క్యూ1లో ధరల్లో 6 శాతం వృద్ధి నమోదైంది.
 



You may be interested

ఎగుమతులు పెరిగాయ్‌... దిగుమతులు తగ్గాయ్‌!

Thursday 15th August 2019

జూలైలో ఎగుమతులు 2.25 శాతం అప్‌ దిగుమతులు 10.43 శాతం క్షీణత వెరసి తగ్గిన వాణిజ్య లోటు  13.43 బిలియన్‌ డాలర్లుగా నమోదు న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు 2019 జూలైలో కేవలం 2.25 శాతం (2018 జూలైతో పోల్చి) పెరిగాయి. విలువ రూపంలో 26.33 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2018 జూలైలో ఈ విలువ 25.75 బిలియన్‌ డాలర్లు. కాగా  అయితే దిగుమతులు మాత్రం 10.43 శాతం తగ్గాయి. విలువ రూపంలో 39.76 బిలియన్‌ డాలర్లుగా

మౌలికానికి రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులు: ప్రధాని

Thursday 15th August 2019

 వచ్చే ఐదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 5 లక్షల కోట్ల డాలర్లకు పెంచడానికి సహాయపడే ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గురువారం ప్రసంగంలో అన్నారు. 73 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారాల నుంచి దేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 'ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ర్యాంకింగ్‌లో,  భారత్

Most from this category