News


రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు ..!

Friday 13th September 2019
Markets_main1568364280.png-28356

మార్కెట్‌ లాభనష్టాల మధ్య ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., రియల్టీరంగ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 1.50శాతానికి పైగా ర్యాలీ చేసింది. నేడు ఈ ఇండెక్స్‌ వద్ద 265.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి రియల్టీరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఇండెక్స్‌ ఒకదశలో 1.65శాతం పెరిగి 268.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:50ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(264.25)తో పోలిస్తే 1.17శాతం లాభంతో 267.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో సన్‌టెక్‌, ఇండియాబుల్స్‌రియల్‌ఎస్టేట్‌ షేర్లు తప్ప మిగిలిన అన్ని షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా డీఎల్‌ఎఫ్‌ షేర్లు 2శాతం లాభపడ్డాయి. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఒబేరాయ్‌ రియల్టీ, ప్రెస్టేజ్‌ లిమిటెడ్‌, ఫోనెక్స్‌, మహీంద్రా లిమిటెడ్‌ షేర్లు 1.5శాతం పెరిగాయి. బ్రిగేడ్‌ లిమిటెడ్‌ షేర్లు 1శాతం, శోభ ఇండస్ట్రీస్‌ అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఇండియాబుల్స్‌రియల్‌ఎస్టేట్‌ షేర్లు 2శాతం నష్టపోగా, సన్‌టెక్‌ షేర్లు 1.50శాతం క్షీణించాయి. 
ఇదే సమయానికి ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 135 పాయింట్ల లాభంతో 37,240.87 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 11,023.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లలో అనూహ్య ర్యాలీ

Friday 13th September 2019

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ షేర్లైన బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ షేర్లకు శుక్రవారం మిడ్‌సెషన్‌లో అనూహ్యంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ మూడు షేర్లు ఇంట్రాడేలో 7శాతం నుంచి 3శాతం ర్యాలీ చేశాయి.  బీపీసీఎల్‌లో కేంద్రం తన వాటాను విదేశీ ఆయిల్‌ కంపెనీకి విక్రయిస్తుందనే వార్తలు వెలుగులోకి రావడంతో ఈ కంపెనీ షేర్లు 7శాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.2:15లకు షేరు క్రితం ముగింపుధర(రూ.384.20)తో పోలిస్తే ఈ షేరు 6శాతం లాభంతో రూ.407.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది కేంద్రం కంపెనీలో

ఇంట్రాడే గరిష్టం నుంచి బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌

Friday 13th September 2019

బ్యాంకింగ్‌ రంగ అ‍‍మ్మకాలతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ఇంట్రాడే గరిష్టం నుంచి 1శాతానికి పైగా పతనమైంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 27,772.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో 100 పాయింట్లు పెరిగి 27,908.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. అనంతరం మార్కెట్లో నెలకొన్న అమ్మకాలతో ఇండెక్స్‌

Most from this category