News


ఆర్‌బీఐ విధాన సమీక్ష ప్రారంభం!

Wednesday 4th December 2019
Markets_main1575430574.png-30037

  • గురువారం ‘కీలక’ ప్రకటన

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం మంగళవారం  ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, వ్యవస్థలో డిమాండ్‌ వంటి కీలక అంశాలపై చర్చించనుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోసహా కీలక నిర్ణయాలను గురువారం ఆర్‌బీఐ వెలువరిస్తుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు కూ2లో  ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి పడిపోవడం, ఆర్థికవ్యవస్థ మందగమనం తీవ్రతను స్పష్టంచేస్తూ పలు గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో తాజా సమావేశం జరుగుతోంది. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని వృద్ధికి ఊపందించడమే లక్ష్యంగా ఆర్‌బీఐ రెపోరేటు మరింత తగ్గుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వృద్ధి గాడిలో పడేంతవరకూ రెపోరేటు తగ్గింపు దిశగానే నిర్ణయాలు ఉంటాయని ఆర్‌బీఐ గవర్నర్‌ గతంలో సూచించారు.  అదే జరిగితే వరుసగా ఆరు ద్వైమాసిక సమావేశాల్లో ఆర్‌బీఐ రెపోరేటు తగ్గించినట్లు అవుతుంది. గడచిన ఐదు సమావేశాల్లో ఆర్‌బీఐ రెపోరేటు 135 బేసిస్‌ పాయింట్లు  (1.35 శాతం) తగ్గింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. తాజా సమావేశంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై ఆర్‌బీఐ అనుసరించే విధానం ఏమిటన్నది ప్రధానంగా చర్చనీయాంశమైంది. గడచిన సమావేశంలో ఈ అంచనాలను ఆర్‌బీఐ 7 శాతం నుంచి 6.1 శాతానికి కుదించింది. 



You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లో ముగిసిన వీఆర్‌ఎస్‌

Wednesday 4th December 2019

స్కీమ్ ఎంచుకున్న 92,700 మంది ఉద్యోగులు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకం మంగళవారంతో ముగిసింది. రెండు సంస్థల్లో 92,700 మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్ ఎంచుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌లో 78,300 మంది, ఎంటీఎన్‌ఎల్‌లో 14,378 మంది దీన్ని ఎంచుకున్నారు. "ఊహించిన స్థాయిలోనే ఇది ఉంది. మేం సుమారు 82,000 మేర సిబ్బంది సంఖ్య తగ్గుతుందని భావించాం. 78,300 మంది

బంగారానికి ‘ట్రంప్‌’ బూస్ట్‌

Wednesday 4th December 2019

వాణిజ్య యుద్ధం ముగింపు ఇప్పట్లో ఉండదన్న సంకేతాలు న్యూయార్క్‌/న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధానికి ఇప్పట్లో ముగింపు లభించే అవకాశాలు లేవన్న సంకేతాలు పసిడికి ఊతం ఇస్తున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌- నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర మంగళవారం  భారీగా పెరిగింది. ఈ వార్తరాసే రాత్రి 9గంటల సమయంలో పసిడి ధర 17 డాలర్లు పెరిగి 1,486 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెజిల్‌, అర్జెంటీనాలపై సోమవారం అమెరికా వాణిజ్య

Most from this category