News


కోపరేటివ్‌ బ్యాంకుల నియంత్రణపై ఆర్‌బీఐ చర్చ

Saturday 12th October 2019
news_main1570855066.png-28839

చండీగఢ్‌: పంజాబ్‌ అండ్‌ మహరాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకులో కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో... కోపరేటివ్‌ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల నియంత్రణ, పర్యవేక్షణ వ్యవస్థపై ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు శుక్రవారం చర్చించింది. కోపరేటివ్‌ బ్యాంకుల మెరుగైన నిర్వహణకు సూచనలు చేసేందుకు గాను ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే చండీగఢ్‌లో ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు సమావేశం జరిగింది. ఆర్థిక రంగ ప్రస్తుత పరిస్థితులు, అంతర్జాతీయ, జాతీయ సవాళ్లు, పలు నిర్వహణ అంశాలపై ఆర్‌బీఐ ఈ సందర్భంగా చర్చించింది. ఆర్థిక రంగ పరిస్థితులతోపాటు, కోపరేటివ్‌, వాణిజ్య బ్యాంకుల నియంత్రణ, పర్యవేక్షణ స్వరూపంపై పూర్తి స్థాయిలో చర్చించినట్టు ఆర్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ బోర్డు సమావేశానికి అధ్యక్షత వహించగా డిప్యూటీ గవర్నర్లు ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌,  బీపీ కనుంగో, మహేష్‌కుమార్‌ జైన్‌తోపాటు డైరెక్టర్లు, ఆర్థిక, ఎకనమిక్‌ వ్యవహారాల కార్యదర్శులు పాల్గొన్నారు. ఆర్థిక సేవల విస్తృతికి పేమెంట్‌ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌బ్యాంకుల పాత్రపైనా ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు చర్చించింది.



You may be interested

వ్యూహాత్మక వాటాల అమ్మకానికి మోగిన గంట

Saturday 12th October 2019

అడ్వైజర్ల నుంచి బిడ్లను ఆహ్వానించిన ప్రభుత్వం కాంకర్‌, నీప్కో, టీహెచ్‌డీసీల్లో వాటాల విక్రయం న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం సలహాదారులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది. కంటెయినర్‌ కార్పొరేషన్‌ (కాంకర్‌), నార్త్‌ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (నీప్కో), టీహెచ్‌డీసీ ఇండియాల్లో వాటాల అమ్మకానికి సంబంధించి అడ్వైజర్ల (లావాదేవీ సలహాదారు/న్యాయ సలహాదారు/ఆస్తుల విలువ మదింపుదారు) నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్‌) నోటిఫికేషన్‌ విడుదల

‘అప్పు’డే వద్దు..!

Saturday 12th October 2019

- రుణాలు తీసుకోవడానికి వెనుకంజ...  - సెప్టెంబర్‌లో రుణ వృద్ధి 8.79 శాతమే... - సింగిల్‌ డిజిట్‌లోకి రావడం  ఈ ఏడాది ఇదే తొలిసారి ముంబై: బ్యాంకులు ఒకపక్క వడ్డీరేట్లు తగ్గిస్తున్నప్పటికీ.. రుణాలు తీసుకోవడానికి మాత్రం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడంలేదు. వినియోగ డిమాండ్‌ బలహీనంగా ఉందనడానికి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనానికి బలమైన నిదర్శనంగా బ్యాంకింగ్‌ రుణ వృద్ధి ఘోరంగా పడిపోతోంది. సెప్టెంబర్‌ 27తో ముగిసిన పక్షానికి(15 రోజుల వ్యవధి) రుణ

Most from this category