News


ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల క్షీణత

Friday 13th September 2019
Markets_main1568356525.png-28352

మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. ఎన్ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ శుక్రవారం ఉదయం సెషన్‌లో 2.60శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3శాతం, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 2.50శాతం క్షీణించాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంక్‌, ఇండియా బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. అలాగే జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌ షేర్లు 1శాతం, అలహదాబాద్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం క్షీణించాయి. పీఎస్‌యూ ఇండెక్స్‌ ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ కిత్రం ముగింపు(2,505.55)తో పోలిస్తే 1.77శాతం లాభంతో 2,461.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

ఇక సమయానికి ప్రధాన సూచీలు మార్కెట్‌ ఆరంభంలో ఆర్జించిన లాభాల్ని పోగొట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 50 పాయింట్ల లాభంతో 37,150.77 వద్ద, నిఫ్టీ 5 పాయింట్లు స్వల్పంగా పెరిగి 10,988.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఈ షేర్లు కొనొచ్చు

Friday 13th September 2019

సెప్టెంబర్‌ నెలకు సంబంధించి వివిధ బ్రోకరేజిలు బై రేటింగ్‌ ఇచ్చిన స్టాకులు: బ్రోకరేజ్: ఫిలిప్ కాపిటల్ కోరమాండల్ ఇంటర్నేషనల్: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ .500; రిటర్న్‌: 32 శాతం స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన యూరియేతర కంపెనీలలో కోరమండల్‌ ఇం‍టర్నేషనల్‌ ముందు వరుసలో ఉంది. బ్యాక్‌వార్డ్‌ ఇంటిగ్రేషన్‌ కలిగి ఉండి క్యాప్టివ్ ఫాస్పోరిక్ ఆమ్లం, వ్యవసాయ రసాయనాలను ఈ కంపెనీ తయారు చేస్తోంది. ఈ కంపెనీ తన ప్రత్యర్ధ కంపెనీలయిన జువారీ ఆగ్రో, జీఎస్‌ఎఫ్‌సీ,

నిఫ్టీ 10,850 స్థాయిని కోల్పోతే అమ్మకాల ఒత్తిడి

Friday 13th September 2019

వరుసగా ఐదు రోజుల లాభాలకు గురువారం సెషన్‌లో బ్రేక్‌ పడింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 166 పాయింట్లు కోల్పోయి 37,104 స్థాయికి, నిఫ్టీ 54 పాయింట్లు కోల్పోయి 10,981 స్థాయికి పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితులలో నిఫ్టీ కీలకమైన 10,850 స్థాయిని కొల్పోతే మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు తెలిపారు. సాంకేతిక విశ్లేషణ: నిఫ్టీ 50 రోజువారి డైలీ చార్టులో బేరిష్‌ ఎంగల్‌ఫింగ్‌ నమూనాను ఏర్పాటు చేసిందని సాంకేతిక విశ్లేషకులు తెలిపారు. గత కొన్ని సెషన్‌ల

Most from this category