News


22 కోట్ల షేర్లను విక్రయించిన ప్రమోటర్‌ సంస్థలు

Thursday 12th September 2019
Markets_main1568257928.png-28314

  • విప్రో షేర్ల బైబ్యాక్‌లో 

న్యూఢిల్లీ: విప్రో షేర్ల బైబ్యాక్‌లో అజిమ్‌ ప్రేమ్‌జీ, ఇతర ప్రమోటర్‌ సంస్థలు 22.46 కోట్ల షేర్లను కంపెనీకి అమ్మేశాయి. వీటి విలువ రూ.7,300 కోట్ల మేర ఉంటుందని అంచనా. గత నెలలో ముగిసిన షేర్ల బైబ్యాక్‌లో భాగంగా మొత్తం 32.3 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్‌  చేశామని విప్రో కంపెనీ వెల్లడించింది. ఒక్కో షేర్‌ను రూ.325కు కొనుగోలు చేశామని, మొత్తం రూ.10,500 కోట్లు షేర్ల బైబ్యాక్‌ కోసం వెచ్చించామని పేర్కొంది. 

74 శాతానికి తగ్గిన ప్రమోటర్‌ వాటా...
షేర్ల బైబ్యాక్‌లో అజిమ్‌ ప్రేమ్‌జీ 1.22 కోట్ల షేర్లను విక్రయించారని విప్రో వెల్లడించింది. ప్రమోటర్‌ సంస్థలు- జష్‌ ట్రేడర్స్‌ 6.12 కోట్ల షేర్లను, ప్రజిమ్‌ ట్రేడర్స్‌ 6.03 కోట్ల షేర్లను, హశమ్‌ ట్రేడర్స్‌ 5.02 కోట్లు, అజిమ్‌ ప్రేమ్‌జీ ట్రస్ట్‌ 4.05 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించాయని పేర్కొంది. ఇక ఎల్‌ఐసీ 1.34 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించిందని తెలిపింది.  షేర్ల బైబ్యాక్‌ అనంతరం విప్రో కంపెనీలో ప్రమోటర్‌ గ్రూప్‌ వాటా 74.05 శాతానికి తగ్గింది. 



You may be interested

ఆటోమొబైల్‌కు జీఎస్‌టీ తగ్గింపుపై త్వరలోనే నిర్ణయం

Thursday 12th September 2019

ఈ విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు: మంత్రి గడ్కరీ న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ రంగానికి జీఎస్‌టీ తగ్గింపు విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు చేస్తున్నామని, త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అధికారం జీఎస్‌టీ మండలికే ఉంటుందని తెలిసిందే. ‘‘రాష్ట్రాలతో ఆర్థిక శాఖ చేస్తున్న సంప్రదింపులపై నేను నమ్మకంతో ఉన్నాను. ఒకవేళ సాధ్యపడితే వారు ఓ నిర్ణయం తీసుకుంటారు’’ అని మంత్రి

ఎస్‌బీఐ లైఫ్‌లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌

Thursday 12th September 2019

ఫ్లోర్‌ ధర రూ.770 ఈ నెల 13న రిటైల్‌ ఇన్వెస్టర్లకు  ముంబై: ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 4.5 శాతం వాటాను ఎస్‌బీఐ విక్రయించనున్నది. కనీస పబ్లిక్‌ హోల్డింగ్‌ నిబంధనలను పాటించడం కోసం ఈ వాటాను విక్రయించడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 3.5 శాతం వాటా(3.5 కోట్ల ఈక్విటీ షేర్ల)ను ఆఫర్‌-ఫర్‌-సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయించనున్నామని పేర్కొంది. అదనంగా సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తే, మరో 1

Most from this category