News


రూ. 1.7 లక్షల కోట్లతో పేదలకు ప్యాకేజీ

Thursday 26th March 2020
Markets_main1585215522.png-32692

కోవిడ్-19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన

కరోనా వైరస్‌ రక్కసితో పోరాటంలో భాగంగా  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా రూ. 1.7 లక్షల కోట్ల విలువైన ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్ యోజన పథకం పేరుతో పేదలు, కార్మికులకు పలు ప్రయోజనాలను కల్పించారు. కోవిడ్‌-19 విస్తరించకుండా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల దృష్టితో పథకాలను రూపొందించినట్లు తెలియజేశారు. ప్రభుత్వంపై పడే భారానికంటే..  పేద ప్రజలను ఆదుకునే అంశానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈ సందర్భంగా సీతారామన్‌ పేర్కొన్నారు. ఈ పథకాన్ని నగదు బదిలీ, ఆహార భద్రత పేరుతో రెండు అంశాలుగా విభజించారు.  

ఇవీ వివరాలు
- కోవిడ్‌-19 వ్యాధిగ్రస్తులకు సేవలందించే సిబ్బందికి ఒక్కొక్కరికీ రూ. 15 లక్షల చొప్పున బీమా సదుపాయం
- ఈ బీమా  2 లక్షల మంది ఆరోగ్యపరిరక్షణ సిబ్బందికి వర్తించనుంది.
- 80 కోట్లమంది పేద ప్రజలకు 5 కేజీల బియ్యం లేదా గోధుమలు
- లాక్‌డౌన్‌ తదుపరి అదనంగా మూడు నెలలపాటు కేజీ తృణధాన్యాలు
- పీఎం కిసాన్‌ తొలి వాయిదా రూ. 2,000ను ప్రభుత్వం చెల్లిస్తుంది. తద్వారా 8.7 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరనుంది.
- ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో భాగంగా పేద కార్మికులకు వేతన పెంపు ద్వారా రూ. 2000మేర లబ్ది.
- ప్రత్యక్ష బదిలీ ద్వారా భర్తలేని మహిళలు, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్లకు మూడు నెలల కాలంలో రూ. 1000 ఎక్స్‌గ్రేషియా. 3 కోట్ల మందికి ప్రయోజనం.
- జన ధన యోజన పథకంకింద 20 కోట్ల మంది మహిళలకు రూ. 500 ఎక్స్‌గ్రేషియా.
- ఉజ్వల పథకంలో భాగంగా 8 కోట్ల కుటుంబాలకు మూడు నెలలపాటు ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా 
- సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ కొలేటరల్‌ ఫ్రీ రుణాల పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంపు.
- కనీసం 100 మంది సిబ్బంది కలిగిన సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు మూడు నెలల ఈపీఎఫ్‌ జమలను కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. నెలసరి వేతనం రూ. 15,000లోపువారికే ఇది వర్తించనుంది.
-  మూడు నెలల జీతం లేదా ఈపీఎఫ్‌ నిధిలో 75 శాతం.. ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని నాన్‌రిఫండబుల్‌ కింద విత్‌డ్రా చేసుకునేందుకు వీలు. 80 లక్షల మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే వీలు.
- భవంతులు, నిర్మాణ రంగ కార్మికులకు రూ. 31,000 కోట్ల వెల్‌ఫేర్ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోజనం చేకూర్చేందుకు అవకాశం.You may be interested

త్వరలో రూ.45000 స్థాయికి బంగారం ధర

Thursday 26th March 2020

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుండడంతో ఇండియాలో 10 గ్రాముల పసిడి రూ.45,000 స్థాయికి చేరవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్, సావర్జీన్‌ గోల్డ్‌ బాండ్స్‌(ఎస్‌జీబీ) కలిగి ఉన్న వారికి ఈ పరిమాణం లాభం చేకూరుస్తుందని అంతర్జాతీయ మార్కెట్‌ కేడియా సలహాదారు అజయ్‌ కేడియా వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉండడంతో ఇండియన్‌ బులియన్‌ జువెల్లర్స్‌ షాపులు మూసేసారు.  దీంతో బుధవారం దేశీయ

బ్యాంక్‌ నిప్టీ ఇండెక్స్‌ 10.50శాతం జంప్‌..!

Thursday 26th March 2020

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం మిడ్‌ సెషన్‌ కల్లా 10.50శాతం(1928 పాయింట్లు) పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ 18,781.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌ రం‍గానికి చెందిన  అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 10శాతం ర్యాలీతో పాటు

Most from this category