News


ఫార్మా, పీఎస్‌యూ స్టాక్స్‌ ఎంచుకోవచ్చు!

Thursday 13th February 2020
Markets_main1581575616.png-31757

పీఎస్‌యూ షేర్లు  బుక్‌ వేల్యూలకు పడిపోయాయ్‌
అధిక డివిడెండ్లను పంచే పీఎస్‌యూలు గుడ్‌   
ఫార్మా రంగంలోనూ ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాలు
- అజయ్‌ శ్రీవాస్తవ, డైమన్షన్స్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌

పాలసీ సమీక్షలో భాగంగా ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ సానుకూల నిర్ణయాలు ప్రకటించిందంటున్నారు డైమన్షన్స్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ నిపుణులు అజయ్‌ శ్రీవాస్తవ,. ఆర్‌బీఐ చర్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయంటూ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రిస్కులున్నప్పటికీ విభిన్న చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్‌బీఐ వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. స్టాక్‌ మార్కె‍ట్లు, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాలపై పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. 

 బడ్జెట్‌ గొప్పగా లేనప్పటికీ విదేశీ, స్వదేశీ పెట్టుబడుల కారణంగా స్టాక్‌ మార్కెట్లు పుంజుకున్నాయి. మార్కెట్లకు, ఎకానమీకి అవినాభావ బంధం ఉంటుంది. కాగా.. ఇటీవల మిడ్‌ క్యాప్స్‌ బాగా బలపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ తదితర పాత స్టాక్స్‌లోకే పెట్టుబడులు ప్రవహించాయి. దీంతో ఈ షేరు రూ. 4000 నుంచి రూ. 4700కు ఎగసింది. అయితే మిడ్‌ క్యాప్స్‌ థీమ్‌పై మాకు బలమైన అంచనాల్లేవు. ప్రస్తుతం ఇటు గుడ్‌ న్యూస్‌ అటు బ్యాడ్‌ న్యూస్‌ లేని పరిస్థితుల్లో ఉన్నాం. చాలావరకూ పెట్టుబడులు సైడ్‌లైన్స్‌లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పెట్టుబడుల యోచనలో ఉన్నారు. ఇందువల్లనే బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే, హెచ్‌యూఎల్‌, పీవీఆర్‌ లేదా అపోలో హాస్పిటల్స్‌ వంటి కౌంటర్లలో కొనుగోళ్లు చేపడుతున్నారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ 5-6 శాతం వృద్ధినే చూపుతున్నప్పటికీ పలు కంపెనీలు పటిష్ట ఫలితాలు సాధించాయి. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రతిఫలిస్తోంది. అయితే వచ్చే ఏడాది నుంచి బేస్‌ ఎఫెక్ట్‌ కనిపిస్తుంది. 

మిడ్‌ క్యాప్స్‌.. ప్చ్‌
ఇటీవల ఢిల్లీ ఎన్నికలను తీసుకుంటే.. ఆర్థిక వ్యవస్థ పురోగతిపట్ల ప్రాధాన్యత కనిపించడంలేదు. ఇది ఆందోళనకరంకాగా.. ప్రస్తుతం ఆర్థిక మందగమనంలో ఉన్నాం. ఈ సమయంలో మిడ్‌ క్యాప్స్‌లో ఇన్వెస్ట్‌ చేయలేం. కాఫీ డే లేదా ఈరోస్‌ మీడియా వంటి ఉదంతాలే దీనికి నేపథ్యం. ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ 12,000 పాయింట్లకు చేరినప్పటికీ చాలావరకూ పీఎస్‌యూ స్టాక్స్‌ కనిష్టాలకు చేరాయి. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, రీసోర్స్‌ కంపెనీలు, ఆయిల్‌ పైప్‌లైన్‌ కంపెనీలు 1-1.25 బుక్‌ వేల్యూకు చేరాయి. గెయిల్‌నే ఉదాహరణగా తీసుకుంటే షేరుకి రూ. 6.5 డివిడెండ్‌ను ప్రకటించింది. రూ. 121 ప్రాంతంలో ట్రేడవుతోంది. అయితే ఒక స్థాయి తదుపరి పీఎస్‌యూ కంపెనీలలో పతనానికి అడ్డుకట్ట పడవచ్చు. దీంతో కేవలం లార్జ్‌క్యాప్స్‌లోనే కాకుండా అధిక డివిడెండ్లను పంచే పీఎస్‌యూ స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేయవచ్చు. 

హెల్త్‌కేర్‌ ఓకే
హెల్త్‌కేర్‌ రంగంలో పెట్టుబడులకు దృష్టిసారించవచ్చు. దేశీ ఫార్మా కంపెనీలు తక్కువ రుణ భారంతో కనిపిస్తున్నాయి. ఇదే విధంగా మెటల్‌ స్టాక్స్‌నూ పెట్టుబడులకు పరిగణించవచ్చు. బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ తదితర లార్జ్‌క్యాప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు బదులుగా ప్రస్తుతం పీఎస్‌యూ, హెల్త్‌కేర్‌ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. గత ఏడాది కాలాన్ని పరిగణిస్తే.. ఈ నిర్ణయం ఆసక్తికరంగా కనిపించకపోవచ్చు. అయితే లార్జ్‌క్యాప్స్‌లోనే కాకుండా వీటిలోనూ ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఇకపై ఇవి టర్న్‌అరౌండ్‌ సాధించవచ్చని భావిస్తున్నాం.

పీఎస్‌యూ పతనం
పీఎస్‌యూ స్టాక్స్‌ను అధిక రిస్క్‌తో కూడిన అధిక రిటర్నులు ఇచ్చేవిగా భావించాలి. నిజానికి గత ఐదేళ్లలో పీఎస్‌యూ స్టాక్స్‌ పతన బాటలో సాగాయి. కొంత కాలంగా వివిధ పీఎస్‌యూ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తూ వస్తు‍న్నాం. మా పోర్ట్‌ఫోలియోలో ఆయిల్‌ మార్కెటింగ్‌, గ్యాస్‌ కంపెనీలున్నాయి. పీఎస్‌యూ స్టాక్స్‌కు అధిక ప్రాధాన్యమివ్వడం కష్టంగానే అనిపించినప్పటికీ భారీ డివిడెండ్లను ఆస్వాదిస్తున్నాం. అయితే పీఎస్‌యూ స్టాక్స్‌పట్ల ఇన్వెస్టర్లు విముఖత చూపడాన్ని తప్పుపట్టబోము. బడ్జెట్‌ను చూస్తే.. ప్రభుత్వం ఎఫ్‌సీఐ, విద్యుత్‌ పంపిణీ కంపెనీలకు సంబంధించి పలు రైటాఫ్‌లను ప్రకటించింది. ఇక రాష్ట్రాలకు జీఎస్‌టీ నష్టాలను భర్తీ చేసే పరిస్థితి కనిపించడంలేదు. నిజానికి వృద్ధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఫైనాన్షియల్‌ రంగంవైపు చూస్తే చాల కంపెనీలు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ కంపెనీలు, ముద్రా రుణాలు, ఎంఎస్‌ఎంఈ తదితర పలు విభాగాలలో మొండి బకాయిలు పేరుకుంటున్నాయి. 

లార్జ్‌ క్యాప్స్‌ భేష్‌
ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు  బ్యాంకింగ్‌ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌ తదితరాలలోనే ఇన్వెస్ట్‌ చేసేందకు ఆసక్తి చూవచ్చు.  పెట్టుబడుల విషయంలో రక్షణాత్మకంగా వ్యవహరించవలసిందే. నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపగలంగానీ.. యస్‌ బ్యాంక్‌ లేదా ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌వైపు దృష్టిసారించలేం. అయితే ఇన్వెస్టర్లు దీర్ఘాతిదీర్ఘ కాలానికి ఇన్వెస్ట్‌చేయడం మేలు చేకూరుస్తుంది. నెస్లే, బజాజ్‌ ఫైనాన్స్‌తోపాటు రిస్కులతో కూడిన వేల్యూ బయింగ్‌ స్టాక్స్‌నూ ఎంపిక చేసుకోవచ్చు. నిజానికి ఏడాది కాలంలో నెస్లే అత్యుత్తమ రిటర్నులు అందించింది. మిడ్‌ క్యాప్స్‌ అంటే కనీసం రూ. 2000 కోట్ల టర్నోవర్‌ కలిగిన కంపెనీలను పరిగణించవచ్చు. రూ. 500 కోట్ల టర్నోవర్‌ కలిగిన కంపెనీలలో కొన్ని మాత్రమే నిలదొక్కుకోగలుగుతాయి. ఆర్థిక వ్యవస్థ 5 శాతం చొప్పున పురోగమిస్తున్న నేపథ్యంలో ఏదైనా ఒక పరిశ్రమలో టాప్‌ ర్యాంకులో ఉన్న కంపెనీ 10 శాతం పురోగమిస్తుంది. ఇదే సమయంలో చిన్న కంపెనీలు క్షీణపథంలో పయనించే అవకాశముంది. ఇందువల్ల ఒక త్రైమాసికంలో మంచి ఫలితాలు సాధించినంత మాత్రాన ఉత్సాహపడనవసరం లేదు. అయితే వృద్ధి అవకాశాలున్న కంపెనీలు అధిక విలువల్లో ట్రేడవుతుంటాయి. ఉదాహరణకు డాక్టర్‌ లాల్‌ పాథ్‌ లేబ్స్‌, మెట్రోపోలిస్‌ వంటి కౌంటర్లు ప్రీమియం పలుకుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) అధిక ధరల్లోనూ వీటిలో ఇన్వెస్ట్‌ చేస్తే.. దేశీ ఫండ్స్‌ 20-40 శాతం మధ్య కరెక‌్షన్‌ వచ్చినప్పుడు సొంతం చేసుకుంటుంటాయి. 

ఐఆర్‌సీటీసీ గ్రేట్‌
రిటైల్‌ విభాగంలో డీమార్ట్‌ ప్రత్యేక తరహా అమ్మకాలతో పైచేయి సాధిస్తోంది. ఇది అందరినీ నివ్వెర పరుస్తోంది. అయితే పీఎస్‌యూ కంపెనీ ఐఆర్‌సీటీసీ మాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.  చిన్న ఇన్వెస్టర్లు సాధారణంగా డీమార్ట్‌ తరహా కంపెనీలను కొనుగోలు చేసే ప్రణాళికలతో కాఫీ డే వంటి కౌంటర్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఇక పీవీఆర్‌ను తీసుకుంటే.. ఈ దశాబ్దపు స్టోరీగా చెప్పుకోవచ్చు. పరిస్థితులకు తగిన బిజినెస్‌ మోడల్‌, నైపుణ్యం, ఉత్సాహం కలిగిన ప్రమోటర్లు కంపెనీ బలం. ఇప్పటికే ర్యాలీ చేసిన ఈ షేరు ఓమాదిరి రిటర్నులకే ఇకపై అవకాశం ఇవ్వవచ్చు. అయితే ప్రజలు సినిమాలు చూస్తున్నంతకాలం కంపెనీకి ఆదాయం సమకూరుతూనే ఉంటుంది!You may be interested

52 వారాల కనిష్టానికి పడిపోయిన 91షేర్లు​

Thursday 13th February 2020

91 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వీటిలో అగ్రిటెక్‌ ఇండియా, ఆగ్రో ఫోస్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, ఆర్కోటెక్‌, ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్‌, అర్టిమీస్‌ మెడికేర్‌ సర్వీసెస్‌, ఆరియన్‌ప్రో సొల్యూషన్స్‌ మిల్స్‌, బాలకృష్ణ పేపర్‌ మిల్స్‌, బాట్రానిక్స్‌ ఇండియా,భారత్‌ గేర్స్‌, బిర్లా టైర్స్‌, సెలస్ట్రియల్‌ బయోల్యాబ్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, జీఎంఐ, కాంప్‌కామ్‌ సాఫ్ట్‌వేర్‌, సీఎస్‌బీ బ్యాంక్‌, దీప్‌ ఇండస్ట్రీస్‌, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్‌స్‌ కార్పొరేషన్‌,

నిఫ్టీ కన్నా మేలైన రాబడినిచ్చిన పీఎంఎస్‌ పథకాలు

Thursday 13th February 2020

కరోనా వైరస్‌ భయాలు, బడ్జెట్‌పై ఊహాగానాలతో జనవరినెల మార్కెట్లు ప్రాఫిట్‌ బుకింగ్‌ చూశాయి. నిఫ్టీ జనవరిలో దాదాపు 2 శాతం పతనమైంది. కానీ ఇదే నెల్లో 100కు పైగా పీఎంఎస్‌ పథకాలు నిఫ్టీ కన్నా మంచి రాబడులు ఇచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 115 పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్‌ పథకాలు పాజిటివ్‌ రాబడులు ఇచ్చాయి. వీటిలో టాప్‌ 8 పథకాలు దాదాపు 10 శాతం కన్నా ఎక్కువ రాబడినిచ్చాయని పీఎంఎస్‌ బజార్‌

Most from this category