News


పేజ్‌ ఇండస్ట్రీస్‌.. క్యూ3 దెబ్బ

Friday 14th February 2020
Markets_main1581675046.png-31800

నిరుత్సాహకర ఫలితాలు
5 శాతం పతనమైన షేరు

జాకీ బ్రాండ్‌ దుస్తుల కంపెనీ పేజ్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత ఆర్థిక సం‍వత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో పేజ్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం 15 శాతం క్షీణించి రూ. 87 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ లాభ మార్జిన్లు 22 శాతం నుంచి 17 శాతానికి బలహీనపడ్డాయి. అయితే మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం పెరిగి రూ. 794 కోట్లకు చేరింది. ఈ కాలంలో అమ్మకాల పరిమాణం సైతం 3 శాతం వెనకడుగు వేసింది. గతేడాది(2018-19) క్యూ3లో అమ్మకాల పరిమాణం 12 శాతం పుంజుకోగా.. ఈ ఏడాది క్యూ2లోనూ 9 శాతం వృద్ది నమోదైంది. ఈ నేపథ్యంలో పేజ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం పతనమైంది. రూ. 22,335 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 21,609 వద్ద కనిష్టాన్ని తాకింది కూడా.



You may be interested

తగ్గిన జీవీకే నష్టాలు

Friday 14th February 2020

జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ శుక్రవారం క్యూ3 ఫలితాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో  ఈ కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర నష్టం నామమాత్రంగా తగ్గి రూ.120.06 కోట్లకు చేరింది. కాగా క్రితం ఆర్థికసంవత్సరం ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.122.61 కోట్లుగా ఉందని బీఎస్‌కీ ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ.1,109.28

మార్కెట్‌లోకి ఎస్‌-సీఎన్‌జీ వ్యాగన్‌ ఆర్‌!

Friday 14th February 2020

దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సరికొత్త  ఎస్‌-సీఎన్‌జీ వ్యాగన్‌ ఆర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. BS-IV నిబంధనలకు అనుగుణంగా సీఎన్‌జీతో నడిచే విధంగా దీనిని రూపొందించారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో 10 లక్షల గ్రీన్‌ వాహనల విక్రయమే లక్ష్యంగా ఈ కారును రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మోడల్‌  ఎక్స్‌షోరూం ధరను రూ.5.25లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటిదాక మారుతీ విడుదల చేసిన BS-IV వాహనాల్లో తాజా ఎస్‌-సీఎన్‌జీ

Most from this category