News


60 వేలకుపైగా వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు

Saturday 9th November 2019
news_main1573269293.png-29462

  • బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌పై 
  • టెలికం కార్యదర్శి ప్రకటన

న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌) ఎంచుకున్న బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఖ్య ఇప్పటికి 60,000 దాటింది. టెలికం సెక్రటరీ అన్‌షూ ప్రకాశ్‌ శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ విషయంలో గడచిన కొద్ది రోజుల్లో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు పెట్టుకున్న ఉద్యోగుల సంఖ్య 57,000కుపైగా ఉందని, ఎంటీఎన్‌ఎల్‌ సంబంధించి సంఖ్యను కూడా కలుపుకుంటే ఇది 60,000 దాటుతోందని ఆయన తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఒక్క శుక్రవారం మధ్యాహ్నానికే వీఆర్‌ఎస్‌కోసం దరఖాస్తు పెట్టుకున్న వారి సంఖ్య 40,000 నుంచి 57,000కు చేరిందని సమాచారం. వీఆర్‌ఎస్‌  పథకానికి స్పందన ‘‘అసాధరణం’’ అని ఆయన పేర్కొన్నారు.  94,000 మందికి వీఆర్‌ఎస్‌ ఇవ్వాన్నది ప్రభుత్వ లక్ష్యంగా సైతం ఆయన సూచించారు. 

స్పందన బాగుంది: బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ
అంతక్రితం బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) పీకే పుర్వార్‌  మాట్లాడుతూ,  సంస్థలో వీఆర్‌ఎస్‌ కింద ఇప్పటికి 40,000కి మందికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.  ‘‘ఇప్పటి వరకూ 40,000కుపైగా దరఖాస్తులు వస్తే, ఇందులో 26,000 మంది గ్రూప్‌ ‘సీ’కి చెందినవారు. అన్ని కేడర్ల నుంచీ పథకానికి స్పందన బాగుంది’’ అని పుర్వార్‌ తెలిపారు.  

బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించి నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో ప్రస్తుతం దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది ఈ పథక ప్రయోజనం పొందడానికి అర్హులు. 70,000 నుంచి 80,000 మంది ఈ పథకాన్ని ఎంచుకుంటారని, దీనివల్ల దాదాపు రూ.7,000 కోట్ల వేతన బిల్లు భారం తగ్గుతుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ భావిస్తోంది.  కేంద్రం అందిస్తున్న  పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ప్రకటించింది.  నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 69,000 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఎంటీఎన్‌ఎల్‌ ఇప్పటికే తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ప్రకటించింది. రెండు కంపెనీల రుణభారం రూ. 40,000 కోట్ల పైగా ఉంది. 



You may be interested

వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ

Saturday 9th November 2019

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిపాజిట్‌, రుణ రేట్లను తగ్గించింది. తాజా రేట్లు నవంబర్‌ 10 నుంచీ అమల్లోకి వస్తాయి. శుక్రవారం బ్యాంక్‌ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. దీనిప్రకారం... నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్‌ఆర్‌) రుణ రేటు అన్ని కాలపరిమితులపై ఐదు బేసిస్‌ పాయింట్లు తగ్గింది.  బ్యాంక్‌ ఈ ఏడాది రుణరేటు తగ్గించడం ఇది వరుసగా ఏడవసారి.  ఆటో, గృహ,

మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.500 కోట్లు తక్కువే: ధీరేంద్ర

Saturday 9th November 2019

మిడ్‌క్యాప్‌లు చౌకగా ఉన్నాయనే అభిప్రాయం పెరుగుతోంది. లార్జ్‌క్యాప్‌లు అధిక న్యాత కలిగినవని, అదే సమయంలో ఖరీదుగా ఉంటాయనే అభిప్రాయం కూడా పెరుగుతోంది. దీర్ఘకాలానికి లాభాలు పొందాలంటే ఈ విధమైన ఆలోచన సరికాదు’’అని వ్యాల్యూరీసెర్చ్‌ సంస్థ సీఈవో ధీరేంద్ర కుమార్‌ అన్నారు. అక్టోబర్‌ నెలకు సంబంధించి మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులపై తన అభిప్రాయాలను ఆయన ఓ వార్తా సంస్థకు తెలియజేశారు.   మిడ్‌క్యాప్స్‌లోకి రూ.500 కోట్లే పెట్టుబడులు వచ్చాయి. కేవలం లార్జ్‌క్యాప్స్‌ మాత్రమే ఆకర్షణీయంగా

Most from this category