News


నిఫ్టీ కన్నా మేలైన రాబడినిచ్చిన పీఎంఎస్‌ పథకాలు

Thursday 13th February 2020
Markets_main1581575490.png-31756

కరోనా వైరస్‌ భయాలు, బడ్జెట్‌పై ఊహాగానాలతో జనవరినెల మార్కెట్లు ప్రాఫిట్‌ బుకింగ్‌ చూశాయి. నిఫ్టీ జనవరిలో దాదాపు 2 శాతం పతనమైంది. కానీ ఇదే నెల్లో 100కు పైగా పీఎంఎస్‌ పథకాలు నిఫ్టీ కన్నా మంచి రాబడులు ఇచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 115 పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్‌ పథకాలు పాజిటివ్‌ రాబడులు ఇచ్చాయి. వీటిలో టాప్‌ 8 పథకాలు దాదాపు 10 శాతం కన్నా ఎక్కువ రాబడినిచ్చాయని పీఎంఎస్‌ బజార్‌ గణాంకాలు వెల్లడించాయి. రూ. 50 లక్షల పైచిలుకు పోర్టుఫోలియో ఉన్న ఇన్వెస్టర్లకు ఈ పీఎంఎస్‌లు సేవలు అందిస్తాయి. సాధారణ ఎంఎఫ్‌ల కన్నా వీటి చార్జీలు కాస్త ఎక్కువ. జనవరిలో మంచి రాబడినిచ్చిన 8 పథకాల్లో క్యాప్‌గ్రో క్యాపిటల్‌ అడ్వైజర్‌ స్పెషల్‌ సిట్యుయేషన్‌ స్కీమ్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఐఓపీ స్కీమ్‌, సెంట్రమ్‌ పీఎంఎస్‌, నిప్పన్‌ ఎమర్జింగ్‌ ఇండియా, ఆంబిట్‌ ఎమర్జింగ్‌ జెయింట్స్‌, సుందరం ఏఎంసీ సెల్ఫ్‌ పోర్టుఫోలియో, సెంట్రమ్‌ పీఎంఎస్‌ గుడ్‌ టు గ్రేట్‌ స్కీమ్‌, ఆనంద్‌ రాఠీ ఇంప్రెసివ్‌ పీఎంఎస్‌ ఉన్నాయి. 
టాప్‌ 8 పీఎంఎస్‌లు, అందించిన రాబడులు, తదితర వివరాలు..

వీటిలో ఎక్కువ శాతం మల్టీక్యాప్‌ ఫండ్స్‌ కాగా మరికొన్న ఎక్కువగా స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ విభాగాలపై దృష్టి పెట్టాయి. జనవరిలో మిడ్‌క్యాప్‌ సూచీ దాదాపు 4 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ దాదాపు 7 శాతం లాభపడ్డాయి. అందువల్ల పీఎంఎస్‌ల్లో ఎక్కువ స్కీములు పాజిటివ్‌ రాబడులిచ్చాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే కాలంలో సైతం చిన్న షేర్ల పరుగులు కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణ మదుపరులు సైతం ఈ సమయంలో చిన్న స్టాకులను స్వల్పమొత్తంలో పోర్టుఫోలియోల్లో చేర్చుకోవచ్చని సూచిస్తున్నారు. You may be interested

ఫార్మా, పీఎస్‌యూ స్టాక్స్‌ ఎంచుకోవచ్చు!

Thursday 13th February 2020

పీఎస్‌యూ షేర్లు  బుక్‌ వేల్యూలకు పడిపోయాయ్‌ అధిక డివిడెండ్లను పంచే పీఎస్‌యూలు గుడ్‌    ఫార్మా రంగంలోనూ ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాలు - అజయ్‌ శ్రీవాస్తవ, డైమన్షన్స్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ పాలసీ సమీక్షలో భాగంగా ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ సానుకూల నిర్ణయాలు ప్రకటించిందంటున్నారు డైమన్షన్స్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ నిపుణులు అజయ్‌ శ్రీవాస్తవ,. ఆర్‌బీఐ చర్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయంటూ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రిస్కులున్నప్పటికీ విభిన్న చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్‌బీఐ వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు

రూ.1,170 కోట్ల ఇల్లు కొన్న అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌

Thursday 13th February 2020

ప్రపంచంలో సంపన్న వ్యక్తి , అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌ అత్యంత ఖరీదైన ఎస్టేట్‌ను కొనుక్కున్నారు.లాస్‌ ఏంజిల్స్‌లోని బేవర్లీ హిల్స్‌లో ఉన్న  మీడియా మొఘల్‌ డేవిడ్‌ గెఫెన్‌కు చెందిన వార్నర్‌ ఎస్టేట్‌ను 165 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసినట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. మన భారత కరెన్సీలో అక్షరాల 1,170 కోట్ల రూపాయలు.  ఈ కొనుగోలు లాస్‌ ఏంజిల్స్‌లోనే  రికార్డు సృష్టించిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికంటే ముందు ఉన్న

Most from this category