News


వీఐఎక్స్‌ అలా... మార్కెట్‌ ఇలా...!

Saturday 13th July 2019
Markets_main1563021314.png-27047

మార్కెట్లు బడ్జెట్‌ తర్వాత ఒక్కమారుగా తిరోగమనం బాటపట్టాయి. నిఫ్టీ 11500 పాయింట్ల వరకు పతనమైంది. దీంతో గత కొన్ని నెలల రేంజ్‌ నుంచి బ్రేక్‌డౌన్‌ చూపినట్లయింది. ప్రస్తుతం నిఫ్టీ తన 20 రోజుల డీఎంఏకు దిగువన ఉంది. ఇదే సమయంలో దేశీయ మార్కెట్‌ కదలికలను ప్రతిబింబించే వీఐఎక్స్‌ సైతం పలు నెలల కనిష్ఠానికి దిగజారడం గమనార్హం. ప్రస్తుతం వీఐఎక్స్‌ 12- 13 రేంజ్‌లో కదలాడుతోంది. ఈ విధంగా ఒక పక్క మార్కెట్‌ డీలా పడిన సమయంలో వీఐఎక్స్‌ కూడా దిగిరావడం సమీప భవిష్యత్‌లో మరింత పతనాన్ని సూచిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంకేతంతో త్వరలో సూచీలు మరింత దిగువకు, వీఐఎక్స్‌ అప్‌మూవ్‌కు ఛాన్సులు పెరిగాయని చెబుతున్నారు. 

వచ్చే వారం నిఫ్టీ కాస్త రికవరీ చూపినా 11700- 11865 పాయింట్ల మధ్య భారీ నిరోధం ఎదుర్కొంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దిగువన 11400 పాయింట్లు గట్టి మద్దతుగా నిలుస్తుందని, దీన్ని కోల్పోతే పతనం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇండికేటర్లలో ఆర్‌ఎస్‌ఐ న్యూట్రల్‌గా, ఎంఏసీడీ నెగిటివ్‌గా ఉంది. చార్టుల్లో ఫాలింగ్‌ స్టార్‌ పాట్రన్‌ ఏర్పడడం కూడా డౌన్‌ట్రెండ్‌ కొనసాగింపునకు సంకేతంగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అప్‌మూవ్‌లన్నీ పరిమితంగా ఉంటాయని, డౌన్‌ట్రెండ్‌ మాత్రమే బలంగా కొనసాగుతుందని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో సూచీల జోలికి పోకుండా, ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 



You may be interested

బడ్జెట్‌ తెచ్చిన భయం కొనసాగేనా?

Saturday 13th July 2019

మార్కెట్‌ విశ్లేషణ దేశీయ మార్కెట్‌ ఈ వారాన్ని తీవ్ర నిరుత్సాహంతో ముగించింది. వారం ఆరంభంలో ఇటీవల కాలంలో అతిపెద్ద ఒకరోజు పతనం నమోదు చేసింది. కేంద్ర బడ్జెట్‌ మార్కెట్‌లో నిరాశ నింపిందని, అందువల్లే మార్కెట్లు తిరోగమనం చెందాయని ఎక్కువమంది అంచనా వేస్తున్నారు. అయితే అధిక వాల్యూషన్లే ఈ పతనానికి అసలు కారణమని, వాల్యూషన్ల కారణ కరెక‌్షన్‌కు బడ్జెట్‌ ఒక ప్రోత్సాహకంగా పనిచేసిందని సామ్‌కో సెక్యూరిటీస్‌ ప్రతినిధి జిమిత్‌ మోదీ చెప్పారు. ప్రస్తుతం

అవెన్యూ సూపర్‌మార్ట్‌ క్యూ1 నికర లాభం రూ.323 కోట్లు

Saturday 13th July 2019

నూతనంగా 8 స్టోర్లను ఆవిష్కరణ డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్‌లెట్లను నడుపుతున్న అవెన్యూ సూపర్‌మార్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.323 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ1లో ఆర్జించిన రూ.245 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 32శాతం అధికం. కన్సాలిడేషన్‌ ప్రాతిపదికన ఈ క్యూ1లో కంపెనీ ఆదాయం 27శాతం వృద్ధి చెంది రూ.5,815 కోట్లను సాధించింది. గతేడాది క్యూ1 కాలానికి కంపెనీ ఆదాయం రూ.4,576 కోట్లుగా

Most from this category