News


పెరిగిన చమురు

Thursday 12th September 2019
Markets_main1568264278.png-28330

యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌ సరళతరం అవ్వడంతోపాటు, యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే తగ్గడంతో గురువారం ట్రేడింగ్‌లో చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.7 శాతం పెరిగి బారెల్‌ 61.22 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 0.7 శాతం పెరిగి బారెల్‌ 56.16 డాలర్లకు చేరుకుంది. 
  యుఎస్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని యాంటీ క్యాన్సర్‌ డ్రగ్స్‌పై తాజాగా విధించిన సుంకాలను చైనా మినహాయించింది. అదే విధంగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై తాజాగా విధించిన సుంకాల అమలు కొంత ఆలస్యం కానుందని యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ ప్రకటించడంతో చమురు ధరలు పెరిగాయి. ఈ ఇరుదేశాల మధ్య జరగనున్న తదుపరి రౌండ్‌ వాణజ్య చర్చలకు ముందు ఈ చర్యలు జరగడం గమనార్హం. ‘ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం, ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న దీర్ఘకాల ట్రేడ్‌వార్‌కు ముగింపు పలికేలా ఉంది’ అని ఆక్షి ట్రేడర్‌ ఏసియా పసిఫిక్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ స్టీఫెన్‌ ఇన్నెస్‌ అన్నారు. అంతేకాకుండా ఇరాన్‌పై విధిస్తున్న ఆంక్షలను సులభతరం​చేయనున్నామనే ట్రంప్‌ నివేదిక వెలువడిన తర్వాత చమురు మార్కెట్‌లో కొంత​అనిశ్చితి ఏర్పడింది. ఇరాన్‌పై ఆంక్షలను సులభతరం చేయడం వలన ఆయిల్‌ సరాఫరా పెరగనుండగా, ఇది అంతర్జాతీయ చమురు డిమాండ్‌పై ప్రభావం చూపనుందని విశ్లేషకులు తెలిపారు. 
  వీటితోపాటు గత వారానికి సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు ఏడాది కనిష్ఠానికి తగ్గాయని యుఎస్‌ ఎనర్జీ ఇన్ఫెర్మేషన్‌ అడ్మినిష్ట్రేషన్‌(ఈఐఏ) బుధవారం నివేధించడంతోకూడా చమురు ధరలు పెరిగాయి. ‘యుఎస్‌ క్రూడ్‌ నిల్వలు వరుసగా నాలుగవ వారంలో కూడా పడిపోయాయి. సెప్టెంబర్‌ 6 తో ముగిసిన వారానికి గాను 27 లక్షల బారెల్‌ల తగ్గుదల ఉంటుందని విశ్లేషకులు అంచనావేయగా, అది 69 లక్షలు తగ్గిందని ఈఐఏ పేర్కొంది. యుఎస్‌ చమురు నిల్వలు 4,161 లక్షల బారెల్స్ వద్ద 2018 అక్టోబర్ తర్వాత కనిష్ట స్థాయికి పడిపోయాయని, అంతేకాకుండా ఈ ఏడాది ఐదేళ్ల సగటు కంటే 2 శాతం తక్కువగా ఉందని ఈఐఏ తెలిపింది.



You may be interested

71.43 వద్ద రూపీ ప్రారంభం​

Thursday 12th September 2019

ఆసియా ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతుండడం, ప్రపంచ ముడి చమురు ధరలు పెరుగుదల మధ్య రూపీ డాలర్‌ మారకంలో గురువారం 23 పైసలు బలపడి 71.43 వద్ద ప్రారంభమైంది. కానీ కొద్ది సమయంలోనే రూపీ డాలర్‌మారకంలో 30 పైసలు కొల్పోయి ట్రేడవుతోంది. దేశియ ఈక్విటీ మార్కెట్లు, చైనా కరెన్సీ యువాన్‌ బలపడడంతో బుధవారం రూపీ డాలర్‌ మారకంలో 5 పైసలు బలపడి 71.66 వద్ద స్థిరపడింది.     దేశీయ స్టాక్‌మార్కెట్లలో పెరుగుదల

28000 పాయింట్లపైకి బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 12th September 2019

ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీ అండగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 28000 పాయింట్ల పైకి ఎగిసింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 27,870.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలోనే ప్రైవేట్‌రంగ షేర్లకు డిమాండ్‌ ఏర్పడటంతో ఇండెక్స్‌ 1శాతం(286 పాయింట్లు) పెరిగి 28,062.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం:10:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(27,776.20)తో పోలిస్తే

Most from this category