News


60 డాలర్ల పైకి క్రూడ్‌ ఆయిల్‌

Friday 11th October 2019
Markets_main1570777078.png-28824

ఒపెక్‌(చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు) దేశాలు చమురు సరఫరాను మరింత తగ్గించనున్నారనే సంకేతాలు వెలువడడంతో పాటు, యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలు బాగా జరిగాయని ట్రంప్‌ ట్వీట్‌ చేయడంతో శుక్రవారం చమురు ధరలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నాం 12.03 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 1.86 శాతం లాభపడి బారెల్‌ 60.20 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 1.68 శాతం లాభపడి బారెల్‌ 54.45 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 1.3 శాతం లాభపడగా, డబ్యూటీఐ క్రూడ్‌ 1.8 శాతం లాభపడింది. 
   చమురు మార్కెట్లను సమతుల్యం చేయడానికి చమురు సరఫరాను మరింత తగ్గించడంతో పాటు అన్ని రకాల అవకాశాలను పరిశీలిస్తున్నామని ఒపెక్‌ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ బార్కిండో గురువారం ప్రకటించారు. ఒపెక్‌, ఇతర భాగస్వాముల మధ్య డిసెంబర్‌లో జరిగే సమావేశంలో తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఒపెక్‌ నెలవారి నివేదిక ప్రకారం..ఒపెక్ తన 2019 అంతర్జాతీయ చమురు డిమాండ్ వృద్ధి అంచనాను రోజుకు 9.8 లక్షల బ్యారెల్‌కు (బీపీడీ) తగ్గించింది. కానీ  2020కి సంబంధించి ఈ వృద్ధి అంచనాలో(10.8 లక్షల బీపీడీ) మాత్రం మార్పుచేయకపోవడం గమనార్హం. 
    ఒపెక్‌ నిర్ణయాల కంటే యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు చమురు మార్కెట్‌ను అధికంగా ప్రభావితం చేస్తున్నాయి.  దీర్ఘకాలంగా కొనసాగుతున్న ట్రేడ్‌ వార్‌ వలన అంతర్జాతీయ మందగమనం ఏర్పడింది. ఫలితంగా చమురుకు డిమాండ్‌ తగ్గిన విషయం తెలిసిందే. ‘యుఎస్‌ అతి పెద్ద చమురు వినియోగ దేశం కాగా, చైనా చమురు డిమాండ్‌పై ప్రభావం చూపగలిగే దేశం కావడం విశేషం’ అని యాక్సిట్రేడర్‌, ఆసియా పసిఫిక్ మార్కెట్ వ్యూహకర్త స్టీఫెన్ ఇన్నెస్ అన్నారు. ‘ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు పాజిటివ్‌గా ముగిస్తే..పతనమైన ఆర్థిక వ్యవస్థలను పుంజుకునేలా చేయడానికి ఇరు దేశాలకు చమురు అవసరం తప్పకుండా ఉంటుంది’ అని ఆయన అన్నారు. కాగా గురువారం యుఎస్‌-చైనా ప్రతినిధుల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు పాజిటివ్‌గా జరగాయని యుఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంతో ఈ చర్చలలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అంచనాలు ఇన్వెస్టర్లలో పెరిగాయి.You may be interested

టీసీఎస్‌పై బ్రోకరేజ్‌ల నిరాశ!

Friday 11th October 2019

టార్గెట్‌ ధర తగ్గింపు తొమ్మిది త్రైమాసికాల కనిష్టానికి మార్జిన్లు పడిపోయినట్లు ప్రకటించిన టీసీఎస్‌పై అనలిస్టులు, బ్రోకింగ్‌ సంస్థలు నిరాశ వ్యక్తం చేశారు. కంపెనీ భవిష్యత్‌ అంచనాలు అందుకునే రేంజ్‌లో లేవని పెదవివిరుస్తున్నారు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ నికరలాభం రూ. 8042 కోట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. సంస్థ ఆపరేటింగ్‌ మార్జిన్లలో 20 బీపీఎస్‌ క్షీణత నమోదయింది. వివిధ బ్రోకింగ్‌ సంస్థలు టీసీఎస్‌ షేరుపై వెలిబుచ్చిన అంచనాలు ఇలా ఉన్నాయి... 1. ఎడెల్‌వీజ్‌: హోల్డ్‌

ఇండస్‌ఇండ్‌ షేరు టార్గెట్‌ తగ్గింపు!

Friday 11th October 2019

క్యు2లో ప్రొవిజన్లు పెరిగినట్లు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రకటించడంతో బ్యాంకు షేరు టార్గెట్‌ధరను బ్రోకింగ్‌ సంస్థలు తగ్గించాయి. షేరుపై వివిధ బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు ఇలాఉన్నాయి... 1. ఎడెల్‌వీజ్‌: టార్గెట్‌ ధరను రూ. 2060 నుంచి 1793కు తగ్గించింది. చారిత్రక ట్రెండ్‌ కన్నా వృద్ధి బాగా క్షీణించింది. ఆస్తుల నాణ్యత ప్రస్తుతానికి బాగానే ఉన్నా, కొన్ని అకౌంట్లు సవాళ్లుగా మారాయి. పీఈ మల్టిపుల్స్‌ దిగివచ్చినందున టార్గెట్‌ను తగ్గించడం జరిగింది. 2. గోల్డ్‌మన్‌ సాక్స్‌: న్యూట్రల్‌

Most from this category