News


ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లలో అనూహ్య ర్యాలీ

Friday 13th September 2019
Markets_main1568365968.png-28357

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ షేర్లైన బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ షేర్లకు శుక్రవారం మిడ్‌సెషన్‌లో అనూహ్యంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ మూడు షేర్లు ఇంట్రాడేలో 7శాతం నుంచి 3శాతం ర్యాలీ చేశాయి. 

  • బీపీసీఎల్‌లో కేంద్రం తన వాటాను విదేశీ ఆయిల్‌ కంపెనీకి విక్రయిస్తుందనే వార్తలు వెలుగులోకి రావడంతో ఈ కంపెనీ షేర్లు 7శాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.2:15లకు షేరు క్రితం ముగింపుధర(రూ.384.20)తో పోలిస్తే ఈ షేరు 6శాతం లాభంతో రూ.407.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది
  • కేంద్రం కంపెనీలో మొత్తం వాటాను 51శాతానికి తగ్గించుకుంటుందనే వార్తల నేపథ్యంలో ఇంట్రాడేలో ఆయిల్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఐఓసీ) షేర్లు 3శాతం పెరిగాయి.మధ్యాహ్నం గం.2:15లకు షేరు క్రితం ముగింపుధర(రూ.124.40)తో పోలిస్తే 2.29 శాతం లాభంతో రూ.127.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది
  • ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ హెచ్‌పీసీఎల్‌ షేర్లు ఇంట్రాడేలో 3.17శాతం పెరిగాయి. మధ్యాహ్నం గం.2:15లకు షేరు క్రితం ముగింపుధర (రూ.259.50)తో పోలిస్తే 2శాతం లాభంతో రూ.267.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

స్మాల్‌, మిడ్‌క్యాప్‌ల్లో ఎంట్రీకి ఇదే సరియైన సమయం!

Friday 13th September 2019

మార్కెట్‌లో పాజిటివ్‌ సెంటిమెంట్‌ తిరిగి పుంజుకున్నట్టనిపిస్తోందని, ఇలాంటి సమయంలో చాలా వరకు మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్ల వాల్యుషన్‌ ఆకర్షణీయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అన్నారు. కాగా బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 2019 లో చేరుకున్న గరిష్ఠ స్థాయి నుంచి (ప్రస్తుతానికి) 22 శాతం కన్నా అధికంగా, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 16 శాతం కన్నా అధికంగా పతనమయ్యాయి.ఈ సమయంలో సెన్సెక్స్‌ 7 శాతం నష్టయింది. ఇదే విధంగా

రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు ..!

Friday 13th September 2019

మార్కెట్‌ లాభనష్టాల మధ్య ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., రియల్టీరంగ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 1.50శాతానికి పైగా ర్యాలీ చేసింది. నేడు ఈ ఇండెక్స్‌ వద్ద 265.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి రియల్టీరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఇండెక్స్‌ ఒకదశలో 1.65శాతం పెరిగి 268.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:50ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(264.25)తో

Most from this category