News


డీసీఐని ప్రైవేటీకరించం

Friday 13th July 2018
news_main1531503662.png-18303

సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ రంగ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను (డీసీఐ) ప్రైవేటీకరించబోమని కేంద్ర ఉపరితల రవాణా, నౌకాయానశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. డీసీఐ నిర్వహణ బాధ్యతలను విశాఖపట్నం, పారదీప్, న్యూమంగుళూరు పోర్టులకు అప్పగించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. దేశంలోని మేజర్‌ పోర్టుల చైర్మన్లతో రెండురోజుల సమీక్షా సమావేశం విశాఖలో జరిగింది. సమావేశానంతరం గడ్కరీ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ, ఆక్వా, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను మరింత విస్తృతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సమీక్షలో నిర్ణయించామన్నారు. ‘‘కాండ్లా పోర్టులో రెండు వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తాం. ఇది అందుబాటులోకి వస్తే యూనిట్‌ విద్యుత్‌ రూ.11 నుంచి 2.40కి తగ్గుతుంది. కాండ్లా, ట్యుటికోరిన్, పారదీప్‌ పోర్టుల్లో ప్రయోగాత్మకంగా ఉప్పునీటిని మంచినీరుగా మార్చే డీశాలినేషన్‌ ప్రాజెక్టును చేపడతాం. దీంతో లీటరు నీరు 3 పైసలకంటే తక్కువకే వస్తుంది. దీన్ని పట్టణ ప్రాంతాలకు సరఫరా చేస్తాం’’ అని వివరించారు. పోర్టులకు వ్యాగన్ల కొరత ఉందని, దీనిని అధిగమించడానికి రైల్వేశాఖ అనుమతితో నౌకాయాన మంత్రిత్వ శాఖే స్వయంగా వాటిని సమకూర్చుకునే యోచన చేస్తోందని వెల్లడించారు. సాగరమాల పథకంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. తొలిదశలో 8.7 లక్షల కోట్లతో 576 కోట్ల ప్రాజెక్టులను చేపడతామని, మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. కొత్తగా మేజర్‌ పోర్టుల్లో కంటైనర్‌ స్కానర్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
 
వాడ్రేవులో పోర్టుకు రడీ..
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా వాడ్రేవులో కొత్తగా పోర్టు నిర్మించే యోచన ఉందని, ఇందుకు 3 వేల ఎకరాలు అవసరమవుతుందని గడ్కరీ చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబును స్థలం అడుగుతామని చెప్పారు. విశాఖ పోర్టు విస్తరణకున్న స్థల సమస్య దృష్ట్యా శాటిలైట్‌ పోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణా నదిలోనూ క్రూయిజ్‌ను ప్రవేశపెడతామని తెలిపారు. ముంబైలో రెండు, విశాఖలో ఒకటి సముద్రంలో తేలియాడే రెస్టారెంట్లను నిర్మిస్తామని కూడా మంత్రి వెల్లడించారు. 
పోర్టులకు అనుబంధంగా ఎస్‌ఈజెడ్‌లు..
మేజర్‌ పోర్టులకు అనుబంధంగా సెజ్‌లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మంత్రి గడ్కరీ తెలిపారు. అలాగే ప్రతి మేజర్‌ పోర్టులో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. విలేకరుల సమావేశంలో కేంద్ర సహాయమంత్రులు మన్‌సుఖ్‌ ఎల్‌ మాండవీయ, రాధాకృష్ణన్, విశాఖ పోర్టు చైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు పాల్గొన్నారు. 
 You may be interested

మీ డ్రెస్‌కు.. మీరే అడ్రెస్‌!!

Friday 13th July 2018

 ‘ఈనాక్షి’లో ఒక డిజైన్‌కు ఒకటే గార్మెంట్‌  ఏడాదిలో ఆఫ్‌లైన్‌ స్టోర్లు ప్రారంభం  ‘స్టార్టప్‌ డైరీతో’ సంస్థ ఫౌండర్‌ నమ్యా పటేల్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘‘అందం అంటే మనకు నచ్చడం కాదు ఎదుటివాళ్లకు నచ్చేలా ఉండటం’’ అనే డైలాగ్‌ను సీరియస్‌గా తీసుకుంది అహ్మదాబాద్‌కు చెందిన ఓ ఫ్యాషన్‌ డిజైనర్‌. ఎదుటివాళ్లకు నచ్చేలా మాత్రమే కాకుండా... మనం వేసుకున్న డ్రెస్‌ డిజైన్‌ ఎదుటి వాళ్లకు లేకుండా చేసేసింది. ‘ఒక మహిళ.. ఒక్క డిజైన్‌.. ఒక్కటే డ్రెస్‌’

నాలుగేళ్లలో రూ.1,200 కోట్ల లక్ష్యం!

Friday 13th July 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోల్‌కతాకు చెందిన మహిళల పర్‌ఫ్యూమ్‌ బ్రాండ్‌ మెకెన్రో వచ్చే నాలుగేళ్లలో రూ.1,200 కోట్ల వ్యాపారాన్ని లక్ష్యించింది. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.408 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నామని.. ఈ ఏడాది రూ.500 కోట్లను లక్ష్యించామని కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ (సీబీవో) సంజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు. శుక్రవారమిక్కడ మార్కెట్లోకి ‘సీక్రెట్‌ టెంప్టేషన్‌’లో రొమాన్స్, మిస్టరీ, అఫైర్, ప్లే, ఫ్యాషన్‌ కొత్త పరిమళాలను విడుదల చేశారు. అనంతరం ఆయన

Most from this category