News


సామాన్యుడి సేవింగ్స్‌కు సంరక్షణేది?!

Friday 11th October 2019
personal-finance_main1570790771.png-28830

ప్రముఖ బ్యాంకర్‌ దీపక్‌ పరేఖ్‌ సూటి ప్రశ్న
బ్యాంకింగ్‌ రంగంలో బయటపడుతున్న వరుస కుంభకోణాలపై ప్రముఖ బ్యాంకర్‌ దీపక్‌ పరేఖ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు రుణమాఫీలు, కార్పొరేట్‌ రుణ రైటాఫ్‌లు చేయడం అనైతికమని దుయ్యబట్టారు. సగటు జీవి దాచుకునే అల్పమొత్తాలకు సరైన రక్షణ కల్పించే విత్త వ్యవస్థ లేకపోవడం అన్యాయమని విమర్శించారు. ఇటీవల బయటపడిన పీఎంసీ కుంభకోణ నేపథ్యంలో సదరు బ్యాంకు ఖాతాదారుల విత్‌డ్రాయల్స్‌పై ఆర్‌బీఐ పరిమితి విధించిన సంగతి తెలిసిందే. మధ్యతరగతి మనిషి కష్టార్జితాన్ని దుర్వినియోగం చేయడాన్ని మించిన పాపం లేదని పరేఖ్‌ నిప్పులు చెరిగారు. బడాబాబులకు మాఫీల సౌకర్యం కల్పించే వ్యవస్థ సృష్టించుకున్నాం కానీ సగటు మనిషి సంపాదనను సంరక్షించే వ్యవస్థను తీసుకురాలేకపోయామన్నారు. ఒక బిజినెస్‌ స్కూల్‌ విద్యార్ధుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
ఏ విత్త వ్యవస్థకైనా నమ్మకం, విశ్వాసమనేవి వెన్నుముకలని, నైతికత, విలువల శక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదని ఆయన హితవు పలికారు. కానీ ఎక్కువసార్లు వ్యవస్థలో ఈ నైతిక విలువలు, విశ్వాసమనేవే తొందరగా మంటగలిసిపోతున్నాయని బాధను వ్యక్తం చేశారు. క్రెడిట్‌ పెరగాలంటే పొదుపు పెరగాలని, ఇటీవల కాలంలో జీడీపీలో పొదుపు వాటా తగ్గుతూవస్తోందని ఆయన హెచ్చరించారు. ఏ ఆర్థిక వ్యవస్థకైనా కుటుంబాల పొదుపే చాలా ముఖ్యమని, అందుకే ఒక దశకు మించి వడ్డీరేట్లను తగ్గించడం కుదరదని చెప్పారు. సగటు మనిషి తన డిపాజిట్‌పై క్రమం తప్పని వడ్డీవస్తుందనే నమ్మకంతో ఉంటాడని, అందుకే ఫిక్స్‌డ్‌డిపాజిట్లు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. అంతర్జాతీయ మందగమనంతో పోలిస్తే ఇప్పటికీ మనం చాలా మేలైన స్థానంలో ఉన్నామని పరేఖ్‌ తెలిపారు. వినిమయ వృద్ధికి సంబంధించి మన దగ్గర కూడా సవాళ్లు ఉన్నాయన్నారు. మార్కెట్లో చక్రీయవలయాలు తప్పక జరిగే పరిణామమన్నారు. డౌన్‌ట్రెండ్‌ వచ్చినప్పుడు గత తప్పిదాలను సరిచేసుకోవడం, విత్త సంస్కరణలు అమలు చేయడం, నిజాయతీతో కూడిన వ్యాపారాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు సత్ఫలితాలనిస్తాయన్నారు. You may be interested

అంచనాల్ని అందుకున్న ఇన్ఫోసిస్‌

Friday 11th October 2019

 ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ క్యూ2 ఫలితాలు మార్కెట్‌ అంచనాల్ని అందుకున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో ఇన్ఫోసిస్‌ కన్సాలిడేటెడ్‌ నికరలాభం గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 2.2 శాతం క్షీణించి రూ. 4,019 కోట్లకు తగ్గింది. నికరలాభం తగ్గినప్పటికీ, ఈ ఏడాది జూన్‌ క్వార్టర్తో పోలిస్తే 5 శాతం పెరగడం విశేషం. మార్కెట్‌ అంచనా రూ. 4008 కోట్లుగా వుంది. కంపెనీ ఆదాయం మాత్రం రూ. 23,255 కోట్లకు పెరిగింది. ఆదాయం

లాభాల్లో ముగిసిన సూచీలు!

Friday 11th October 2019

 వాషింగ్టన్‌లో గురువారం నుంచి ప్రారంభమైనా యుఎస్‌-చైనా ప్రతినిధుల మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగడంతో, యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ ఒక కొలిక్కి వస్తుందని ఇన్వెస్టర్లు ఆశాజనకంగా ఉన్నారు. ఫలితంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లతో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా ముగిశాయి. గత 15 నుంచి సుదీర్ఘంగా కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌ వలన అంతర్జాతీయ ఆర్థిక మందగమనం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. యుఎస్‌-చైనా ప్రతినిధుల మధ్య చర్చలు బాగానే జరిగాయని యుఎస్‌ అధ్యక్షుడు

Most from this category