News


నిఫ్టీ 12వేల దిగువకు రాదు!

Thursday 13th February 2020
Markets_main1581569308.png-31751

ఎఫ్‌అండ్‌ఓ అనలిస్టుల అంచనా
నిఫ్టీ ఈ సీరిస్‌లో 12వేల దిగువకు రాకపోవచ్చని ఎఫ్‌అండ్‌ఓ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అందువల్ల కొంచెం రిస్కు తీసుకోగల ఇన్వెస్టర్లు ఈ నెల అవుట్‌ ఆఫ్‌ ద మనీ(ఓటీఎం) నిఫ్టీపుట్స్‌ను విక్రయించవచ్చని సూచిస్తున్నారు. పుట్‌ కాల్‌ నిష్పత్తి(పీసీఆర్‌) పెరుగుతుండడం, ఆప్షన్‌ ఐవీలో క్షీణత పరిశీలిస్తే నిఫ్టీ పుట్‌ విక్రయం మంచి లాభాలనిస్తుందని అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ సాధ్యమైతే అప్‌మూవ్‌ చూపడం లేదా స్తబ్దుగా ఉండడమే జరుగుతుందని, 12000 పాయింట్ల కిందకైతే రాదని చెబుతున్నారు. ఇదే ధోరణి కొనసాగుతుందని, దీంతో పుట్స్‌ ప్రీమియంలు కరిగిపోయి పుట్‌ రైటర్స్‌కు లాభాన్నిస్తాయని వివరించారు. 
ప్రస్తుతం ఫిబ్రవరి 27కు ఎక్స్‌పైరీ అయ్యే నిఫ్టీ ఆప్షన్స్‌ ఇలా ఉన్నాయి...

వారం లేదా నెల ఎక్స్‌పైరీ చెందే 12000 పుట్‌ లాట్స్‌ను విక్రయించవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్‌ అనలిస్టు అమిత్‌ గుప్తా సూచించారు. వీఐఎక్స్‌ బాగా దిగిరావడం సూచీల్లో స్థిరత్వాన్ని చూపుతుందన్నారు. పీసీఆర్‌ పెరగడం బుల్లిష్‌ సంకేతమని, అందువల్ల ఓటీఎం పుట్స్‌ విక్రయించవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అనలిస్టు చందన్‌ తపారియా సూచించారు. పుట్‌ రైటింగ్‌కు ఫ్యూచర్స్‌ లాట్‌కు కావలిసినంత మార్జిన్‌ అవసరపడుతుంది, కాబట్టి చూసుకొని ఈ వ్యూహం అవలంబించాలని నిపుణుల సూచన.



You may be interested

మార్కెట్‌ను ముందుకు నడిపించే మూడు అంశాలు!

Thursday 13th February 2020

దేశీయ మార్కెట్లు బడ్జెట్‌ రోజు పతనం అనంతరం వీ ఆకారపు రికవరీని వేగంగా సాధించాయి. కానీ 12200 పాయింట్ల వద్ద నిఫ్టీ నిరోధం ఎదుర్కొంటోంది. దీంతో ఇకపై నిఫ్టీ ర్యాలీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ సందేహాలు నిరర్ధకమని, నిఫ్టీ సమీప భవిష్యత్‌లో ముందుకే దూసుకుపోతుందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టు పంకజ్‌ బోబ్డె భరోసా ఇస్తున్నారు. లాంగ్‌టర్మ్‌కు సైతం సూచీలు ముందుకే కొనసాగుతాయని, మధ్యలో కొంత చిన్న పాటి కరెక‌్షన్స్‌

సెలెక్ట్‌ మొబైల్స్‌ ‘గ్రాండ్‌ వాలంటైన్స్‌ డే ఆఫర్స్‌’

Thursday 13th February 2020

హైదరాబాద్‌: ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మొబైల్‌ రిటైల్‌ కంపెనీ సెలెక్ట్‌ మొబైల్స్‌ గ్రాండ్‌ వాలంటైన్స్‌ డే ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 13, 14 తేదీల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ సీఎండీ వై గురు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని అన్ని సెలెక్ట్‌ మొబైల్‌ షోరూమ్‌లలో ఈ ఆఫర్లు లభ్యమవుతాయని పేర్కొన్నారు. రూ.25,500 విలువ చేసే శాంసంగ్‌ ఏ6 కేవలం రూ.8,999లకు, రూ.8,999 విలువ

Most from this category