News


బ్యాంక్‌ నిప్టీ ఇండెక్స్‌ 10.50శాతం జంప్‌..!

Thursday 26th March 2020
Markets_main1585215131.png-32691

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం మిడ్‌ సెషన్‌ కల్లా 10.50శాతం(1928 పాయింట్లు) పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ 18,781.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌ రం‍గానికి చెందిన  అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 10శాతం ర్యాలీతో పాటు  ఇండస్‌ ఇండ్‌ 40శాతం, బంధన్‌ బ్యాంక్‌ 45శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు 9శాతం పెరగడంతో ఇండెక్స్‌ ఒక దశలో 10.50శాతం పెరిగి 20వేల స్థాయిపై 20409.35 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం 2గంటలకు ఇండెక్స్‌ మునుపటి ముగింపు(18481.05)తో పోలిస్తే 5.50శాతం లాభంతో 19,490.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ఇండస్‌ బ్యాంక్‌ 38శాతం, బంధన్‌ బ్యాంక్‌ 31శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 9శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 8శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 5శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 4.50శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 3.50శాతం లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 4.50శాతం, పీఎన్‌బీ షేరు 2శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 1శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

రూ. 1.7 లక్షల కోట్లతో పేదలకు ప్యాకేజీ

Thursday 26th March 2020

కోవిడ్-19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన కరోనా వైరస్‌ రక్కసితో పోరాటంలో భాగంగా  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా రూ. 1.7 లక్షల కోట్ల విలువైన ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్ యోజన పథకం పేరుతో పేదలు, కార్మికులకు పలు ప్రయోజనాలను కల్పించారు. కోవిడ్‌-19 విస్తరించకుండా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల దృష్టితో పథకాలను రూపొందించినట్లు తెలియజేశారు.

నేడు ఏడాది కనిష్టాన్ని తాకిన షేర్లు ఇవే..!

Thursday 26th March 2020

గురువారం ఎన్‌ఎస్‌ఈలో 240 షేర్లు 52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. వీటిలో ఆధునిక్‌ ఇండస్ట్రీస్, ఏజీస్‌ లాజిస్టిక్స్, ఆగ్రో మొన్నెట్‌ ఇస్పాట్‌ అండ్‌ ఎనర్జీ, క్స్‌ ఆఫ్టీఫైబర్, అలోక్‌ ఇండస్ట్రీస్, అంబుజా సిమెంట్స్, అన్సాల్‌ హౌసింగ్, ఆర్కిస్, ఆర్కోటెక్, అరిహంత్‌ ఫౌండేషన్స్‌ అండ్‌ హౌసింగ్, ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్, ఆసియాన్‌ హోటల్స్‌(నార్త్‌), అట్లాంటా, అట్లాస్‌ సైకిల్స్‌ (హరియాణ),ఏటీఎన్‌ ఇంటర్నేషనల్, ఆసమ్‌ ఎంటర్‌ ప్రైజ్, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్, యాక్సిస్‌కేడ్స్‌ ఇంజనీరింగ్‌

Most from this category