News


లాభాల ఓపెనింగ్‌ ..!

Wednesday 25th March 2020
Markets_main1585109146.png-32662

  • అంతర్జాతీయ మార్కెట్లను నుంచి సానుకూల సంకేతాలు
  • 250 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ 
  • 7800 పైన నిఫ్టీ ప్రా‍రంభం
  • రిలయన్స్‌ 8శాతం జంప్‌


అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చున్న దేశీయ మార్కెట్‌ బుధవారం లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 258.41 పాయింట్ల లాభంతో 26932.44 వద్ద, నిఫ్టీ 72.05 పెరిగి 7873.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ ధాటికి విలవిలాడుతున్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు భారీ ప్యాకేజీని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఎలాంటి పరిమితులు లేకుండా బాండ్లను, సెక్యూరిటీలను కొనుగోళ్లు చేయడటం, కంపెనీలకు నేరుగా రుణాలివ్వడం తదితర చర్యలను ఫెడ్‌ తీసుకుంది. ఈ జోష్‌తో నిన్న ఆసియా మార్కెట్లతో రాత్రి అమెరికా మార్కెట్లు 1933 ఏడాది తర్వాత అతిపెద్ద ర్యాలీ చేశాయి. అదే ఊపుతో నేడు ఆసియా మార్కెట్లు సైతం 3నుంచి6శాతం లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. 


ఇక దేశీయ పరిణామాల విషయానికొస్తే... కరోనా వైరస్‌ విజృంభణను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా మంగళవారం అర్థరాత్రి నుంచి 21రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ అంశం మార్కెట్‌ను ప్రతికూలంగా మారొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మహారాష్ట్ర నూతన సంవత్సరాది గుడి పడ్వ పర్వదినం సందర్భంగా నేడు ఫారెక్స్‌ మార్కెట్‌ పనిచేయదు. 

ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 475.87 పాయింట్ల లాభంతో 27149.90 వద్ద, నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి 7934.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌, ఫార్మా, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండగా,  బ్యాంకింగ్‌, మీడియా, అటో రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల నష్టాల ట్రేడింగ్‌ కారణంగా ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 0.20శాతం నష్టపోయి 17,075.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

జీ లిమిటెడ్‌, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 3శాతం నుంచి 5.50శాతం నష్టపోయాయి.  టెక్‌ మహీంద్రా, గ్రాసీం, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, నెస్లే ఇండియా, రిలయన్స్‌ షేర్లు 3.50శాతం నుంచి 8శాతం వరకు లాభపడ్డాయి. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 25th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు రియలన్స్‌ ఇండస్ట్రీస్‌: భారతీయ అతిపెద్ద వైర్‌ లెస్‌ నెట్‌వర్క్‌ రిలయన్స్‌ జియో కంపెనీలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌  10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.   క్వెస్‌ కార్ప్‌ లిమిటెడ్‌: కోవిడ్‌ –19 సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుండటంతో కంపెనీ తన ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) చేయనుంది. యస్‌బ్యాంక్‌: రేటింగ్‌ సంస్థ ఐసీఆర్‌ఏ

డోజోన్స్‌- వండర్‌

Wednesday 25th March 2020

1933 తదుపరి డోజోన్స్‌ దూకుడు ఎస్‌అండ్‌పీ -12నాటి ఏళ్ల రికార్డ్‌ భారీ సహాయక ప్యాకేజీ అంచనాలు   ప్రజలకూ, ఆర్థిక వ్యవస్థలకూ పెనునష్టాన్ని కలిగిస్తోన్న కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా అమెరికా ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించనున్న అంచనాలు మంగళవారం ఇన్వెస్టర్లకు ఎక్కడలేని ఉత్సాహాన్నీ ఇచ్చాయి. దీంతో మూకుమ్మడిగా కొనుగోళ్లకు ఎగబడటంతో డోజోన్స్‌ ఇండెక్స్‌ ఏకంగా 2,113 పాయింట్లు (11.4 శాతం) దూసుకెళ్లింది. ఇంతక్రితం 1933లో మాత్రమే ఒకే రోజులో ఇంత అధికంగా

Most from this category