News


192 బిలియన్ డాలర్లకు ఐటీ ఆదాయాలు

Thursday 13th February 2020
news_main1581567455.png-31743

  • 2019-20పై నాస్కామ్ అంచనా
  • డిజిటల్‌ ఆదాయాల ఊతం

ముంబై: దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (ఐటీ-బీపీఎం రంగం ఆదాయాలు 2020 ఆర్థిక సంవత్సరంలో 8.4 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తెలిపింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 192 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. 2019-20లో కొత్త తరం డిజిటల్ విభాగాల ఆదాయాలు 23 శాతం పెరగడం, నికరంగా 2.05 లక్షల ఉద్యోగాల కల్పన జరగడం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని నాస్కామ్ వివరించింది. భవిష్యత్‌ అంచనాలకు సంబంధించి పరిశ్రమ ఆశావహంగానే ఉన్నప్పటికీ కాస్త ఆచితూచి వ్యవహరించే ధోరణే కొనసాగించనున్నట్లు నాస్కామ్ చైర్మన్ కేశవ్ మురుగేశ్ విలేకరులకు తెలిపారు. 43.6 లక్షల మంది సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చే ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాలు కచ్చితంగా ఎంత స్థాయిలో ఉంటాయన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు చెప్పారు. అయితే, సరఫరా వ్యవస్థలో చైనా కీలక దేశం కావడంతో క్లయింట్లపైనా, ఫలితంగా పరిశ్రమపైనా పరోక్షంగా ప్రభావాలు ఉండొచ్చని చెప్పారు.

సర్వేలో ఎకానమీపై ఆశావహంగా సీఈవోలు...

  • 2020లో ప్రపంచ ఎకానమీ ప్రస్తుత స్థాయిలో లేదా మరింత పటిష్టంగా ఉండగలదని నాస్కామ్ నిర్వహించిన ఓ సర్వేలో మెజారిటీ సీఈవోలు అభిప్రాయపడ్డారు. సర్వే ప్రకారం.. 100 మంది సీఈవోల్లో 53 శాతం మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్ధమాన మార్కెట్లలో పెట్టుబడులు పెరగగలవని 60 శాతం మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు భావిస్తున్నారు. 
  • దేశీ ఐటీ కంపెనీలు మొత్తం 191 బిలియన్ డాలర్ల ఆదాయాల్లో సుమారు 1.5 శాతం మొత్తాన్ని .. ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు వెచ్చిస్తున్నాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో 8 లక్షల మంది పైగా ఉ‍ద్యోగులకు శిక్షణనిచ్చాయి. 
  • భారత్‌లో 9,000 పైగా స్టార్టప్‌లు ఉండగా, వీటిలో 27 సంస్థలు 1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్‌తో యూనికార్న్ హోదాను దక్కించుకున్నాయి.   You may be interested

తెలంగాణలో హట్సన్‌ ఐస్‌క్రీమ్‌ ప్లాంట్‌

Thursday 13th February 2020

207 కోట్ల పెట్టుబడి; 250 ఉద్యోగాలు అక్టోబర్‌ నుంచి కార్యకలాపాలు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చెన్నైకి చెందిన పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్స్... తెలంగాణలో అతిపెద్ద ఐస్‌క్రీమ్‌ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. రూ.207 కోట్ల పెట్టుబడులతో సంగారెడ్డి జిల్లాలోని గోవింద్‌పూర్‌లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 250 మందికి ఉద్యోగాలతో పాటు, పరోక్షంగా మరో 250 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, స్థానికంగా ఉన్న

రూ.187 పెరిగిన పుత్తడి

Thursday 13th February 2020

  కరోనా వైరస్‌ ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులపై దృష్టి పెడుతుండడంతో గురువారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే రూ.187 పెరిగి 10 గ్రాముల పసిడి ధర రూ.40,607.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటిముగింపు ధరతో పోలిస్తే 5 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,576.65 డాలర్ల వద్ద ట్రేడ్‌

Most from this category