News


ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌ జోరుగా కొన్న షేర్లివే!

Friday 11th October 2019
Markets_main1570787872.png-28828

దేశీయంగా రెండవ అతి పెద్ద ఆస్తి నిర్వహణ సంస్థయిన ఐసీఐసీఐ ప్రూడన్సియల్‌ ఏఎంసీ, సెప్టెంబర్‌ నెలలో ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ, ఫైనాన్సియల్స్‌, ఇన్సురెన్స్‌, పవర్‌, ఫార్మా స్టాకులను భారీగా కొనుగోళ్లు చేసింది. ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌) దిగ్గజ కంపెనీ అయిన ఐటీసీ, ప్రభుత్వ రంగ హైడ్రోపవర్‌ ఉత్పత్తి సంస్థయిన ఎన్‌హెచ్‌పీసీ కంపెనీ షేర్లను కోటీ చొప్పున కొనుగోలు చేసింది. కాగా ఈ కంపెనీల షేరు విలువ ఈ ఏడాది ప్రారంభం నుంచి అక్టోబర్‌ 9 వరకు 10 శాతం చొప్పున పడిపోయాయి.
అధికంగా కొనుగోళ్లు చేసిన షేర్లు.. 
    వీటితో పాటు యాక్సిస్ బ్యాంక్, ఈక్విటాస్ హోల్డింగ్స్, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, గెయిల్ (ఇండియా), ఎన్‌టీపీసీ, భెల్, పవర్ గ్రిడ్, కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీలకు చెందిన స్టాకులను ఒక్కొక్క కంపెనీ నుంచి 20 లక్షలకు పైగా కొనుగోలు చేసింది. వీటిలో ఈ ఏడాదిలో ఐసీఐసీఐ బ్యాంక్ ( 20 శాతం అప్‌), కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ (16 శాతం అప్‌), యాక్సిస్ బ్యాంక్ (9 శాతం అప్‌) షేర్ల మినహ మిగిలిన షేర్లన్ని నష్టపోవడం గమనార్హం. 
దిగ్గజ ఐటీ కంపెనీల వైపు మొగ్గు..
   ఐసీఐసీఐ ప్రూడెన్సియల్‌ ఏఎంసీ ఐటీ దిగ్గజాలయిన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌(18 లక్షల షేర్లు), విప్రో (5.88 లక్షల షేర్లు), టాటా కన్సల్టన్సీ సర్వీసెస్‌(4.64 లక్షల షేర్లు) షేర్లను తన పోర్టుఫోలియోకి అదనంగా జోడించింది. క్యూ2 ఫలితాలలో మార్కెట్‌ అంచనాలను టీసీఎస్‌ అందుకోలేకపోవడంతో, టీసీఎస్‌ షేరు టార్గెట్‌ ధరను  హైటాంగ్‌ సెక్యురిటీస్‌ రూ. 1,925 కు(ముందు టార్గెట్‌ ధర రూ. 2,170) తగ్గించిన విషయం గమనార్హం.
ఫైనాన్సియల్‌ షేర్లలో..
  రుణ సంక్షోభం ఒక కొలిక్కి రావడంతో ఫైనాన్సియల్‌ సెక్టార్‌లో కొనుగోళ్లు పెరిగాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ కూడా ఈ సెక్టార్‌కు సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా (16 లక్షల షేర్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (15.43 లక్షల షేర్లు), ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (11.50 లక్షల షేర్లు), యస్ బ్యాంక్ (7.80 లక్షల షేర్లు), కోటక్ మహీంద్రా బ్యాంక్ (5.28 లక్షల షేర్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాం‍క్‌ (4.01 లక్షల షేర్లు) షేర్లను తన పోర్టుఫోలియోకి జోడించింది. వీటితో పాటు టెలికాం సెక్టార్‌ నుంచి భారతి ఎయిర్‌టెల్ (11 లక్షల షేర్లు), వోడాఫోన్ ఐడియా (4.77 లక్షల షేర్లు) షేర్లను ఈ ఆస్తి నిర్వహణ సంస్థ కొనుగోలు చేసింది. కాగా ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై నిమిషానికి 6 పైసలు వసూల్‌ చేయాలని రిలయన్స్ జియో నిర్ణయం తీసుకోవడంతో గత సెషన్‌లో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా షేర్లు ర్యాలీ చేసిన విషయం తెలిసిందే. జియో తీసుకున్న ఈ నిర్ణయం వలన  టెలికాం సెక్టార్‌లోని ఇతర కంపెనీలు రేట్లను పెంచడంపై ఒత్తిడి తగ్గనుంది. 
ఇన్సురెన్స్‌ సెక్టార్‌ నుంచి..
  ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్యియల్‌ కంపెనీలు) సంక్షోభంలో కూడా మంచి ప్రదర్శన చేసిన ఇన్సురెన్స్‌ స్టాకులను ఈ ఏఎంసీ తన ఖాతాలో వేసుకుంది. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌, జనరల్‌ ఇన్సురెన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ లాంబర్డో జనరల్‌ ఇన్సురెన్స్‌ కంపెనీల షేర్లను కొనుగోలు చేసింది. 
 ఆటో సెక్టార్‌లో..
 ఆటో సెక్టార్‌కు సంబంధించి అశోక్‌ లేలాండ్‌(9.77 లక్షల షేర్లు), మదర్‌సుమి(6.19 లక్షల షేర్లు), మిండా ఇండస్ట్రీస్‌(5.49 లక్షల షేర్లు), మారుతి సుజుకి(1.34 లక్షల షేర్లు) కంపెనీల షేర్లను కొనుగోళ్లు చేసింది. వీటితో పాటు బలరాంపూర్ చీనీ మిల్స్, దాల్మియా భారత్, పాలికాబ్ ఇండియా, రైల్ వికాస్ నిగం, వీల్స్ ఇండియా షేర్లను కూడా ఈ ఏఎంసీ కొనుగోళ్లు చేసింది. 
పూర్తిగా విక్రయించిన షేర్లు..
  మరోవైపు ఆసాహి ఇండియా, హట్సన్ ఆగ్రో, జెట్ ఎయిర్‌వేస్, మోన్శాంటో, షాల్బీ, టాటా కమ్యూనికేషన్స్‌, టెక్నో ఎలక్ట్రిక్స్‌ షేర్లను ఈ ఏఎంసీ పూర్తిగా విక్రయించింది. మొత్తంగా ఐసీఐసీఐ ప్రూడన్సియల్‌ ఏఎంసీ తన పోర్టుఫోలియోలో 431 కంపెనీల స్టాకులను పెంచుకోగా, వివిధ సెక్టార్‌లకు చెందిన 89 కంపెనీలలో తన వాటాను తగ్గించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి ఐసీఐసీఐ ప్రూడన్సియల్‌ ఏఎంసీ, 550 కంపెనీలకు చెందిన స్టాకులను కలిగి ఉంది.
అధికంగా విక్రయించిన స్టాకులు 
ఈ ఆస్తి నిర్వహణ కంపెనీ, టాటా పవర్, సెయిల్, లార్సెన్ అండ్‌ టూబ్రో, ఎస్‌జేవీఎన్‌, హెక్సవేర్ టెక్, ఓఎన్‌జీసీ, స్పైస్ జెట్, జేఎస్‌డబ్యూ ఎనర్జీ, కంటైనర్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, సీఈఎస్‌సీ, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌, ఎంసీఎక్స్‌, కోల్ ఇండియా, ఇంజనీర్స్ ఇండియా, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ కంపెనీలకు చెందిన షేర్లను అధికంగా విక్రయించింది.You may be interested

లాభాల్లో ముగిసిన సూచీలు!

Friday 11th October 2019

 వాషింగ్టన్‌లో గురువారం నుంచి ప్రారంభమైనా యుఎస్‌-చైనా ప్రతినిధుల మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగడంతో, యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ ఒక కొలిక్కి వస్తుందని ఇన్వెస్టర్లు ఆశాజనకంగా ఉన్నారు. ఫలితంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లతో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా ముగిశాయి. గత 15 నుంచి సుదీర్ఘంగా కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌ వలన అంతర్జాతీయ ఆర్థిక మందగమనం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. యుఎస్‌-చైనా ప్రతినిధుల మధ్య చర్చలు బాగానే జరిగాయని యుఎస్‌ అధ్యక్షుడు

గ్రే మార్కెట్లో ఐఆర్‌సీటీసీ షేర్లకు భారీ ప్రీమియం

Friday 11th October 2019

బంపర్‌ లిస్టింగ్‌ సంకేతాలు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) షేర్లు సోమవారం బంపర్‌ లిస్టింగ్‌ నమోదు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చిన అనూహ్య స్పందనే షేర్ల లిస్టింగ్‌పై అంచనాలను పెంచగా, తాజాగా షేరుకు గ్రేమార్కెట్లో పెరిగిన ప్రీమియం ఈ అంచనాలను మరింత బలపరుస్తోంది. శుక్రవారం గ్రేమార్కెట్లో కంపెనీ షేరు దాదాపు 70 శాతం ప్రీమియంతో ట్రేడవుతోంది. చాలా రోజుల తర్వాత ఒక కొత్త కంపెనీ

Most from this category