News


వృద్ధి 5.8 శాతమే: మూడీస్‌

Friday 11th October 2019
Markets_main1570766450.png-28816

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) 5.8 శాతంగానే ఉంటుందని పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 6.2 శాతం. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా 6.1 శాతం. మూడీస్‌ తాజా అంచనాలు ఆర్‌బీఐ అంచనాలకన్నా తక్కువ కావడం గమనార్హం. పెట్టుబడుల మందగమనం దీనితో వినియోగం తగ్గడం, గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యపరమైన ఒత్తిడులు, ఉపాధి కల్పనలో వెనుకబాటు వంటి అంశాలు వృద్ధి రేటు అంచనా తాజా కోతకు కారణమని మూడీస్‌ పేర్కొంది. అయితే 2020-21లో జీడీపీ వృద్ధి 6.6 శాతం ఉంటుందని జీడీపీ అంచనావేసింది. 

6.1 శాతం... అంటున్న ఇండియా రేటింగ్స్‌
కాగా 2019-20లో వృద్ధి రేటు 6.1 శాతం ఉంటుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ అంచనావేస్తోంది. బలహీన డిమాండ్‌ తమ తాజా అంచనాలకు కారణంగా పేర్కొంది. నిజానికి గడచిన రెండు నెలల్లో జీడీపీ అంచనాలను ఇండియా రేటింగ్స్‌ రెండుసార్లు తగ్గించింది. 7.3 శాతం నుంచి 6.7 శాతానికి తర్వాత ప్రస్తుతం 6.1 శాతానికి ఇండియా రేటింగ్స్‌ కుదించింది. 



You may be interested

లాభాల్లో మెటల్‌ షేర్లు

Friday 11th October 2019

చైనా, అమెరికా మధ్య ట్రేడ్‌వార్‌ పాజిటివ్‌గా ముగుస్తుందన్న అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా మెటల్‌ షేర్లు పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో దేశీయ మెటల్‌ షేర్లు కూడా లాభాల్లో ఆరంభమయ్యాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు ఒక్క శాతం లాభంతో 2300 పాయింట్ల వద్ద ఆరంభమై 2320 పాయింట్లను చేరి క్రమంగా 2 శాతం పైగా లాభపడి 2336 పాయింట్లను తాకింది. 9.30 నిమిషాలు దాటేసరికి దాదాపు 3 శాతం లాభంతో

కోపరేటివ్‌ బ్యాంకుల మెరుగైన నిర్వహణకు చర్యలు

Friday 11th October 2019

అవసరమైతే చట్టానికి సవరణలు ఇందు కోసం ఓ ప్యానెల్‌ ఏర్పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన ముంబై: కోపరేటివ్‌ బ్యాంకుల మెరుగైన నిర్వహణకు అవసరమైతే చట్టంలో సవరణలు తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇటీవలే ఆర్‌బీఐ ఆంక్షల పరిధిలోకి వెళ్లిన పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) డిపాజిటర్ల ఆగ్రహాన్ని మంత్రి గురువారం ముంబై వచ్చిన సందర్భంగా స్వయంగా చవిచూశారు. దక్షిణ ముంబైలోని బీజేపీ

Most from this category