News


ఇప్పటికీ భారత్‌లోనే ఇంటర్నెట్‌ చౌక..

Tuesday 3rd December 2019
news_main1575333393.png-30009

  • టెలికం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం మీద భారత్‌లోనే మొబైల్‌ డేటా రేట్లు అత్యంత తక్కువని కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. బ్రిటన్‌కు చెందిన కేబుల్‌.కో.యూకే అధ్యయనంలో ఇది వెల్లడైందని మైక్రోబ్లాగింగ్‌ సైటు ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చార్టును పోస్ట్‌ చేశారు. దీని ప్రకారం.. ఒక గిగాబైట్‌ (జీబీ) డేటా సగటు ధర భారత్‌లో 0.26 డాలర్లుగా ఉండగా.. బ్రిటన్‌లో 6.66 డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లుగా ఉంది. ప్రపంచ సగటు 8.53 డాలర్లుగా ఉంది.

దేశీ టెల్కోలు భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌–ఐడియా, రిలయన్స్‌ జియో .. ఏకంగా 50%దాకా టారిఫ్‌లను పెంచు తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఈ మొబైల్‌ చార్జీల సమస్యంతా.. కుంభకోణాలతో అప్రతిష్ట పాలైన యూపీఏ ప్రభుత్వ ఘనతే.  దాన్ని మేం సరిచేశాం. అధిక మొబైల్‌ ఇంటర్నెట్‌ చార్జీలు.. యూపీఏ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చాయి. ట్రాయ్‌ గణాంకాల ప్రకారం 2014లో ఒక్క జీబీకి చార్జీ రూ. 268.97గా ఉండేది. ప్రస్తుతం ఇది రూ. 11.78కి తగ్గింది. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌/ఎంటీఎన్‌ఎల్‌ను కూడా ప్రొఫెషనల్‌గా, లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మంత్రి పేర్కొన్నారు.  



You may be interested

ఆ మాటలతో.. దేశ ప్రయోజనాలకు విఘాతం

Tuesday 3rd December 2019

రాహుల్‌ బజాజ్‌ విమర్శలపై ఆర్థిక మంత్రి నిర్మల వ్యాఖ్య న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనే దమ్ము లేకుండా పోయిందంటూ వ్యాపార దిగ్గజం రాహుల్‌ బజాజ్‌ చేసిన విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. తమ సొంత అభిప్రాయాలను అందరికీ ఆపాదించడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు.  ఇలాంటి విమర్శలు .. జాతి ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రులు పీయూష్‌

కార్వీకి మరో షాక్‌..!

Tuesday 3rd December 2019

ట్రేడింగ్‌ లైసెన్సు సస్పెండ్‌ చేసిన ఎక్సే్ఛంజీలు నిబంధనలు ఉల్లంఘించినందుకే శాట్‌ను ఆశ్రయించనున్న సంస్థ పీవోఏపై ఊరటనివ్వని సెబీ ముంబై/హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ కార్వీకి ఒకదాని తర్వాత మరొకటిగా షాకులు తగులుతున్నాయి. తాజాగా  అన్ని విభాగాల్లో ట్రేడింగ్‌ లైసెన్సును సస్పెండ్‌ చేస్తున్నట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సోమవారం ప్రకటించాయి.  ఎక్సే్ఛంజీల నిబంధనలను ఉల్లంఘించడమే ఇందుకు కారణమని వెల్లడించాయి. సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని వేర్వేరుగా

Most from this category