News


మైండ్‌ట్రీ ఆదాయం రూ.1,965 కోట్లు

Wednesday 15th January 2020
news_main1579059292.png-30934

  • 10 శాతం వృద్ధి 
  • 3 శాతం పెరిగిన నికర లాభం 

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ మైండ్‌ట్రీకి ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.197 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.191 కోట్ల నికర లాభం ఆర్జించామని కంపెనీ సీఈఓ, ఎమ్‌డీ దేబాశిష్‌ చటర్జీ తెలిపారు. 3 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. గత క్యూ3లో రూ.1,787 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ3లో 10 శాతం వృద్ధితో రూ.1,965 కోట్లకు పెరిగిందని వివరించారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, నిర్వహణ లాభ మార్జిన్‌ 2.6 శాతం, నికర లాభం 45 శాతం చొప్పున పెరిగాయని తెలిపారు. 

ఆదాయం 9 శాతం అప్‌...
డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 3 శాతం వృద్ధితో 2.8 కోట్ల డాలర్లకు, ఆదాయం 9 శాతం వృద్ధితో 28 కోట్ల డాలర్లకు పెరిగాయని చటర్జీ పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్‌ నాటికి చురుకైన ‍క్లయింట్ల సంఖ్య 320గా ఉందని వివరించారు. తమ కంపెనీలో మొత్తం 21,561 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఆట్రీషన్‌ రేటు (ఉద్యోగుల వలస) 17.2 శాతంగా ఉందని తెలిపారు. ఆదాయంలో వృద్ధి సాధిస్తున్నామని, లాభదాయక వృద్ధి సాధించడంపైనా కూడా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. గత ఏడాది జూలైలో ఈ కంపెనీని ఎల్‌ అండ్‌ టీ టేకోవర్‌ చేసిన విషయం తెలిసిందే. 



You may be interested

టోకు ద్రవ్యోల్బణానికి ఉల్లి సెగ

Wednesday 15th January 2020

(అప్‌డేటెడ్‌...) డిసెంబర్‌లో 2.59 శాతంగా నమోదు ఇది 8 నెలల గరిష్టం జనవరిలోనూ ధరల మంట తప్పదంటున్న విశ్లేషకులు న్యూఢిల్లీ: ఉల్లి, బంగాళదుంప తదితర కూరగాయల ధరలు భారీగా పెరగడంతో డిసెంబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (ఽడబ్ల్యూపీఐ) ఎనిమిది నెలల గరిష్టానికి ఎగిసింది. 2.59 శాతంగా నమోదైంది. నవంబర్‌లో ఇది 0.58 శాతంగా ఉండగా, 2018 డిసెంబర్‌లో 3.46 శాతంగా నమోదైంది. 2019 ఏప్రిల్‌లో 3.24 శాతం తర్వాత మళ్లీ ఆ స్థాయి నమోదు

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ‘2020 హోమ్‌ లోన్‌’ ఆఫర్‌

Wednesday 15th January 2020

ముంబై: ఎల్‌ఐసీ అనుబంధ సంస్థ అయిన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ‘2020 హోమ్‌లోన్‌ ఆఫర్‌’ను బుధవారం ఆవిష్కరించనుంది. దీని కింద గృహ రుణాలపై పలు ఆఫర్లను అందించనున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. ‘నివాసం ఉన్నప్పుడే చెల్లించండి’ అనే పథకం కింద.. తీసుకున్న రుణానికి అసలును (ప్రిన్సిపల్‌) ఆ ఇల్లు స్వాధీనం చేసుకున్నప్పుడు లేదా రుణం జారీ చేసిన 48 నెలల తర్వాత (ఈ రెండింటిలో ఏది ముందయితే

Most from this category