News


కోవిడ్‌ సంక్షోభం నుంచి గట్టెక్కుతాం..!

Thursday 26th March 2020
news_main1585193888.png-32683

  • మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ధీమా

న్యూయార్క్:   కోవిడ్-19 సంక్షోభంతో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వాటన్నింటినీ అధిగమించి బైటపడగలదని సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ధీమా వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ ఆర్థికంగా బలమైన స్థితిలోనే ఉందని, మరింత పటిష్టంగా మారగలదని ఆయన చెప్పారు. తాము గతంలో ప్రకటించిన ఉత్పత్తులను ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు కొనసాగుతోందని తెలిపారు. అయితే, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అమెరికా, యూరప్, ఇతర సంపన్న దేశాల్లో ఈ ఉత్పత్తులకు డిమాండ్ ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వర్క్‌-ఫ్రం-హోం విధానం పాటిస్తున్న నాదెళ్ల ఈ సందర్భంగా తన ఇంటి ఆఫీస్ విశేషాలను కూడా పంచుకున్నారు. తన విధుల నిర్వహణలో కుమార్తెలు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. మరోవైపు, ఎకానమీని కరోనా వైరస్‌ నుంచి గట్టెక్కించడానికి అమెరికా ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడాన్ని నాదెళ్ల స్వాగతించారు. 



You may be interested

‘‘ప్యాకేజీ’’ లాభాల ప్రారంభం ..!

Thursday 26th March 2020

దేశీయ మార్కెట్‌ గురువారం లాభంతో ప్రారంభమైంది. కరోనా వైరస్‌ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.5ట్రిలియన్ల ప్యాకేజీని సిద్ధం చేస్తుందనే అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే ఆర్థిక అగ్రరాజ్యమైన అమెరికా సెనెట్‌ సైతం కరోనా వైరస్‌ ఉద్దీపన చర్యల్లో భాగంగా  2ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి ఆమోదం తెలపడటంతో పాటు వైట్‌హౌస్‌కు పంపడం కూడా మార్కెట్లకు ఉత్సాహానిచ్చింది. దీంతో బెంచ్‌మార్క్‌ సూచీలు నిన్నటి భారీ లాభాల

టెల్కోలకు లాక్‌ డౌన్ కష్టాలు..!

Thursday 26th March 2020

భారీగా పెరిగిన డేటా ట్రాఫిక్‌ నెట్‌వర్క్‌పై అదనపు భారం నెట్ స్పీడ్ తగ్గకుండా  చూసేందుకు టెల్కోల చర్యలు న్యూఢిల్లీ: కరోనా వైరస్ భయాల కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో టెలికం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఓవైపు కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేస్తుండటం, మరోవైపు ఇంటి పట్టునే ఉండాల్సి రావడంతో ప్రజలు కాలక్షేపం కోసం ఎక్కువగా ఇంటర్నెట్‌నే వినియోగిస్తుండటంతో డేటా వినియోగం భారీగా పెరిగిపోతోంది. నెట్‌వర్క్‌లపై

Most from this category