అమ్మకాల ఒత్తిడిలో మెటల్ షేర్లు
By Sakshi

బ్రెజిల్, అర్జెంటీనాల ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలను పునరుద్ధరించనున్నట్లు ట్రంప్ ప్రకటనతో మంగళవారం మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నేడు ఎన్ఎస్ఈలో మెటల్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఉదయం సెషన్లో దాదాపు 3శాతం నష్టపోయింది. ‘‘బ్రెజిల్, అర్జెంటీనాలు డాలర్ మారకంలో తన దేశపు కరెన్సీ విలువను భారీగా క్షీణింపజేసుకుంటున్నాయి. తద్వారా ఈ దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే అమెరికా రైతులకు భారీ నష్టాలను మిగుల్చుతుంది. అందుకు ప్రతీకారంగా ఈ రెండుదేశాల నుంచి అమెరికాకు ఎగుమతయ్యే స్టీల్, అల్యూమినియంపై సుంకాలను పునరుద్దరించనున్నాము. ఫెడ్ రిజర్వ్ కూడా ఇతర కరెన్సీల్లో డాలర్ బలహీనపడే చర్యలకు ఉపేక్షించకూడదు. తక్కువ వడ్డీరేట్లు నష్టాలను మిగులుస్తాయి’’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం తన సామాజిక మాధ్యమంలో రాసుకొచ్చారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలలో మెటల్ షేర్లు అమ్మకాలు నెలకొన్నాయి. ఇదే క్రమంలో నేడు దేశీయ మార్కెట్లో నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. మధ్యాహ్నం గం.12:15ని.లకు నిఫ్టీ మెటల్ ఇండెక్స్ క్రితం ముగింపు(2,632.65)తో పోలిస్తే 2.50శాతం నష్టంతో 2,568.65 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో జిందాల్ స్టీల్ అత్యధికంగా 8.50శాతం నష్టపోయింది. యూబీఎస్ రేటింగ్ డౌన్‌గ్రేడ్‌తో టాటాస్టీల్ 4శాతం నష్టపోయింది. సెయిల్ 4శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 3.50శాతం, ఏపిల్ అపోలో 3శాతం, వేదంత, హిందూస్థాన్ కాపర్ 2.50శాతం, హిందాల్కో 2శాతం, నాల్కో 1శాతం, వెల్స్పన్ కార్ప్, హిందూస్థాన్ జింక్, కోల్ ఇండియా అరశాతం నష్టపోయాయి. మరోవైపు ఎన్ఎండీసీ 1శాతం, మెయిల్, రత్నమని మెటల్ లిమిటెడ్ షేర్లు అరశాతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మెటల్ స్టాక్స్ ఒత్తిడిలో ఉన్నాయి. పేలవమైన డిమాండ్, అంతర్జాతీయ కమోడిటీ ధరల పతనం కారణంగా ఉక్కు కంపెనీలు మార్జిన్లలో తగ్గముఖం పట్టాయి.
You may be interested
సెన్సెక్స్ 250 పాయింట్లు డౌన్
Tuesday 3rd December 2019ఆర్బీఐ పాలసీ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత మరోసారి తెరపైకి అంతర్జాతీయ వాణిజ్య భయాలు మెటల్, బ్యాంక్, ఇన్ఫ్రా రంగ షేర్ల అమ్మకాల ఒత్తిడితో మంగళవారం మిడ్‌సెషన్ కల్లా భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ దాదాపు 250 పాయింట్లును కోల్పోగా, నిఫ్టీ 12వేల దిగువకు దిగివచ్చింది. నేటి ఉదయం దేశీయ స్టాక్ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. అయితే జాతీయ, అంతర్జాతీయ పరిణాలు సూచీలను నష్టాల్లోకి మళ్లించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశంలో
లాంగ్ టర్మ్‌కు టాప్ 9 సిఫార్సులు
Tuesday 3rd December 2019దీర్ఘకాలానికి మంచి రాబడినిచ్చే తొమ్మిది స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు సిఫార్సు చేస్తున్నాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రికమండేషన్ 1. సన్ టెక్ రియల్టీ: కొనొచ్చు. టార్గెట్ రూ. 487. ఇటీవల ప్రారంభించిన అవెన్యూ4 టవర్స్‌తో వచ్చే మూడు నాలుగేళ్లలో దాదాపు రూ. 12-13 వందల కోట్ల ఆదాయం సమకూరనుంది. దీంతో పాటు త్వరలో ఆరంభించబోయే అంధేరీ ప్రాజెక్ట్, నైగావ్ ఫేజ్2 ప్రాజెక్టులు కంపెనీ విక్రయాల్లో జోరును పెంచుతాయి. మోతీలాల్ ఓస్వాల్ రికమండేషన్లు 1. ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్: