News


లాభాల్లో మెటల్‌ షేర్లు

Friday 11th October 2019
Markets_main1570766561.png-28817

చైనా, అమెరికా మధ్య ట్రేడ్‌వార్‌ పాజిటివ్‌గా ముగుస్తుందన్న అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా మెటల్‌ షేర్లు పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో దేశీయ మెటల్‌ షేర్లు కూడా లాభాల్లో ఆరంభమయ్యాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు ఒక్క శాతం లాభంతో 2300 పాయింట్ల వద్ద ఆరంభమై 2320 పాయింట్లను చేరి క్రమంగా 2 శాతం పైగా లాభపడి 2336 పాయింట్లను తాకింది. 9.30 నిమిషాలు దాటేసరికి దాదాపు 3 శాతం లాభంతో 2350 వద్దకు చేరింది.

ఇండెక్స్‌లోని ప్రధానమైన షేర్లన్నీ(ఒక్క నాల్కో మినహా) పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. వీటిలో వేదాంత దాదాపు 4 శాతం, టాటా స్టీల్‌, హిండాల్కో, జేఎస్‌పీఎల్‌, సెయిల్‌, కోల్‌ఇండియాలు సుమారు 2 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. ఇదే సమయానికి ప్రధాన సూచీ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంతో 11314 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఇటీవల కాలంలో ట్రేడ్‌వార్‌ కారణంగా ప్రపంచవ్యాప్త మందగమనం వస్తుందన్న భయాలతో కమోడిటీ స్టాకులు నేల చూపులు చూస్తున్నాయి. తాజాగా ట్రంప్‌ చేసిన ప్రకటన ట్రేడ్‌వార్‌కు ఒక తాత్కాలిక ముగింపు లేదా పాక్షిక ముగింపైనా ఉంటుందన్న అంచనాలను కలిగించింది. 

 You may be interested

పావు శాతం దిగొచ్చిన రుణ రేట్లు

Friday 11th October 2019

-ఆర్‌బీఐ తాజా రేట్ల తగ్గింపుతో సానుకూలత న్యూఢిల్లీ: గత నెలలో ఆర్‌బీఐ కీలక రేట్లకు మరో విడత కోత పెట్టిన తర్వాత నుంచి సుమారు అరడజను ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రుణాలపై రేట్లను పావు శాతం వరకు తగ్గించాయి. దీంతో గృహ, ఆటో, ఇతర రుణాలు చౌకగా మారాయి. ఆర్‌బీఐ పాలసీ రేట్లకు అనుగుణంగానే .. రిటైల్‌ విభాగం, ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణాలపై రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్టు, రెపో

వృద్ధి 5.8 శాతమే: మూడీస్‌

Friday 11th October 2019

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) 5.8 శాతంగానే ఉంటుందని పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 6.2 శాతం. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా 6.1 శాతం. మూడీస్‌ తాజా అంచనాలు ఆర్‌బీఐ అంచనాలకన్నా తక్కువ కావడం గమనార్హం. పెట్టుబడుల మందగమనం దీనితో వినియోగం తగ్గడం, గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యపరమైన

Most from this category