News


అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Thursday 16th January 2020
news_main1579154116.png-30961

మార్కెట్లో బెంచ్‌మార్క్‌ సూచీలు కొత్త రికార్డు స్థాయిని అందుకున్నప్పటికీ.., మెటల్‌ షేర్లు మాత్రం అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు 2,920.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అమెరికా-చైనాల మధ్య నిన్నరాత్రి జరిగిన మొదటిదశ వాణిజ్య ఒప్పందంపై అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ చేశారు. అయితే ఇరుదేశాలు కుదుర్చుకున్న ఒప్పందాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రయోజనకరంగా ఉండకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తుండంతో అంతర్జాతీయంగా మెటల్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా మెటల్‌ షేర్లు నష్టాల బాటపట్టాయి. ఉదయం గం.10:50ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు (2,921.45)తో పోలిస్తే 1.66శాతం నష్టపోయి 2,921.45 వద్ద 2872.90 ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో కోల్‌ ఇండియా షేరు 2.50శాతం నష్టపోయింది. వేదాంత, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, జిందాల్‌ స్టీల్‌, టాటా స్టీల్‌ షేర్లు 2శాతం క్షీణించాయి.హిందాల్కో, నాల్కో, సెయిల్‌, ఎన్‌ఎండీసీ షేర్లు 1శాతం నుంచి అరశాతం పతనమయ్యాయి. మరోవైపు ఇదే రంగానికి చెందిన రత్నమని లిమిటెడ్‌ షేర్ల 2.50శాతం లాభపడింది. అలాగే మెయిల్‌, హిందూస్థాన్‌ కాపర్‌, ఏపిఎల్‌ అపోలో, వెల్‌స్పన్‌ కార్ప్‌, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు 1శాతం నుంచి 0.10శాతం లాభపడ్డాయి. 



You may be interested

ఎల్‌ఐసీ హౌసింగ్‌- డెన్‌ నెట్‌వర్క్స్‌ అప్‌

Thursday 16th January 2020

స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ గృహ రుణ విభాగంలో 2020 పేరుతో సరికొత్త ఆఫర్లను ప్రకటించడంతో మార్టిగేజ్‌ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఉదయం 11.40 ప్రాంతంలో

దీర్ఘకాలిక లాభాలపై పన్ను ఎత్తివేత?

Thursday 16th January 2020

ఎల్‌టీసీజీ పన్నుకు చెక్‌ కేంద్ర బడ్జెట్‌పై అంచనాలు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో దీర్ఘకాలిక లాభాలపై పన్ను విధింపును తొలగించే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. గత బడ్జెట్‌(2019)లో కేంద్ర ఆర్థిక శాఖ దీర్ఘకాలిక పెట్టుబడులపై లాభాల(ఎల్‌టీసీజీ) విషయంలో పన్ను విధింపును ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఈ చర్యపై పలువర్గాల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం పన్ను సలహాదారులు, నిపుణులతో ఎల్‌టీసీజీపై పన్ను తొలగింపు అంశంపై చర్చలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా

Most from this category