News


మెటల్‌ షేర్లకు డిమాండ్‌

Wednesday 4th December 2019
Markets_main1575452940.png-30054

అనూహ్యంగా అమెరికా చైనాల మధ్య చర్చలు సఫలవంతం కావచ్చనే వార్తలు మార్కెట్‌ చివరి గంటలో తెరపైకి రావడంతో మెటల్‌ షేర్లలో కొనుగోళ్ల పర్వం నెలకొంది. దీంతో ఉదయం నుంచి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్న మెటల్‌ షేర్లు ఒక్కసారిగా లాభాల పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఇంట్రాడే కనిష్టం నుంచి 100పాయింట్లు(4శాతం) మేర పెరిగింది. నేడు ఇండెక్స్‌ 2,536.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్లో నెలకొన్న అమ్మకాల కారణంగా ఉదయం ట్రేడింగ్‌లో 2శాతం నష్టపోయి 2,514.00వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే మార్కెట్‌ గంటలో ముగిస్తున్న తరుణంలో అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలు కుదరవచ్చని ఏజెన్సీల ద్వారా వార్తలు వెలుగులోకి రావడంతో మెటల్‌ షేర్లకు అనూహ్యంగా డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా మెటల్‌ ఇండెక్స్‌ కనిష్టస్థాయి (2,514.00) నుంచి 4శాతం పెరిగి 2613.15 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,564.20) పోలిస్తే 1.45శాతం లాభంతో 2,600.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా ఎన్‌ఎండీసీ 4.50శాతం లాభపడింది. సెయిల్, వేదాంత, జిందాల్‌ స్టీల్‌ షేర్లు 3శాతం పెరిగాయి. హిందాల్కో, టాటాస్టీల్‌ షేర్లు 2.50శాతం ర్యాలీ చేశాయి. వాటితో ఏపిల్‌అపోలో, జేఎస్‌డబ్ల్యూస్టీ‌ల్‌, నాల్కో షేర్లు 1.50శాతం లాభపడగా, మెయిల్‌ షేరు మాత్రం అరశాతం పెరిగింది. కోల్‌ ఇండియా 1.50నష్టపోగా, వెల్‌స్పన్‌కార్ప్‌, హిందూస్థాన్‌ కాపర్‌, రత్నమణిలిమిటెడ్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. 



You may be interested

ఎకానమీలో రికవరీతో లాభపడే షేర్లివే!

Wednesday 4th December 2019

ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌ మెరుగుపడితే ముందుగా లాభపడే టాప్‌ షేర్లను కోటక్‌ సెక్యూరిటీస్‌, ట్రేడింగ్‌ బెల్స్‌, సిటిగ్రూప్‌ తదితర బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.  1. ఎస్‌బీఐ: బ్యాంకు లోన్‌బుక్‌లో 30 శాతం వాటా రిటైల్‌ విభాగానిదే. హోమ్‌లోన్స్‌తో లోన్‌బుక్‌ మంచి వృద్ధి నమోదు చేస్తోంది. వడ్డీ వ్యయాల తగ్గింపు, లోన్‌ గ్రోత్‌, బలమైన ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ గ్రోత్‌తో రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో రిటర్న్‌ రేషియో మరింత మెరుగుపడుతుందని అంచనా.  2. ఐసీఐసీఐ బ్యాంక్‌:

బాండ్‌ ఈటీఎఫ్‌లు కొంటారా? ఇవి గమనించండి!

Wednesday 4th December 2019

దేశీయ తొలి కార్పొరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ లాంచింగ్‌కు ప్రభుత్వం బుధవారం అనుమతినిచ్చింది. దీంతో ఇకపై రిటైల్‌ ఇన్వెస్టర్లు దేశీయ బాండ్‌ మార్కెట్లో పాలుపంచుకోవచ్చు. బాండ్‌ జారీల ద్వారా ప్రభుత్వ సంస్థలకు నిధులు సమకూర్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లకు ఆమోదం తెలిపింది. ఈ బాండ్స్‌లో మూడు, పదేళ్ల కాలపరిమితి రకాలున్నాయి. బాండ్‌ ఈటీఎఫ్‌ల గురించి మరిన్ని వివరాలు... = స్టాక్‌ ఎక్చేంజ్‌ల్లో వీటిని లిస్ట్‌ చేస్తారు. = వీటిలో ఏఏఏ-,

Most from this category