News


ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల ‘డేటా బ్యాంక్‌’ ఆరంభం

Tuesday 3rd December 2019
news_main1575335941.png-30015

న్యూఢిల్లీ: ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల వివరాలతో కూడిన సమగ్రమైన ‘డేటా బ్యాంక్‌’ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ డేటా బ్యాంక్‌లో ప్రస్తుతమున్న ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల వివరాలతో పాటు ఇండిపెండెంట్‌ డైరెక్టర్లయ్యే అర్హత గల వారి వివరాలను కూడా పొందుపరుస్తారు. కంపెనీలు ఏవైనా ఇండిపెండెంట్‌ డైరెక్టర్లను నియమించుకోవాలనుకుంటే ఈ డేటా బ్యాంక్‌ వాటికి ఉపయోగపడుతుంది. ఈ డేటా బ్యాంక్‌ పోర్టల్‌ను కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఇండి యన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ (ఐఐసీఏ) నిర్వహిస్తుంది.  2013 నాటి కంపెనీల చట్టం ప్రకారం ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు ఈ నెల 1 నుంచి 3 నెలలలోపు తమ వివరాలను ఈ డేటాబ్యాంక్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా, 2020 మార్చి నుంచి అందుబాటులోకి వచ్చే ఆన్‌లైన్‌ ప్రొఫిషియెన్సీ సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలో ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది. 



You may be interested

విశాఖలో ఉబెర్‌ ఎక్సలెన్స్‌ సెంటర్‌

Tuesday 3rd December 2019

 2020 చివరికి 500 మందికి ఉపాధి న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ‘ఉబెర్‌’.. విశాఖపట్నంలో తన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)ను సోమవారం ప్రారంభించింది. ఈ కేంద్రం ఏర్పాటు నిమిత్తం రూ. 5.73 కోట్లను వెచ్చించినట్లు ప్రకటించింది. అత్యవసర సమస్యలను పరిష్కరించడం, ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించడం కోసం శిక్షణ పొందిన బృందాలు ఇక్కడ నుంచే నిరంతర సేవలను అందిస్తాయని వివరించింది. ప్రస్తుతం ఈ కేంద్రంలో 70 మంది

హైదరాబాద్‌లో ఇంటెల్‌ డిజైన్‌ సెంటర్‌

Tuesday 3rd December 2019

ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ ఏడాదిలో 1,200 మంది నియామకం కంపెనీ ఎస్‌వీపీ రాజా ఎం కోడూరి   హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చిప్‌ తయారీ దిగ్గజం ఇంటెల్‌ ఇండియా... డిజైన్, ఇంజనీరింగ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. 3 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో 1,500 సీట్ల సామర్థ్యంతో దీనిని నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Most from this category