News


మారుతీ కార్ల ధరలు పెంపు..!

Wednesday 4th December 2019
news_main1575429845.png-30035

  • జనవరి 1 నుంచి అమలు

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని ఇక నుంచి కస్టమర్లకు బదలాయించక తప్పదని, గడిచిన ఏడాది కాలం నుంచి ధరల భారం ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో 2020 జనవరి నుంచి పెరిగే ధరలు మోడల్‌ ఆధారంగా  ఉండనున్నట్లు వివరించింది. ప్రస్తుతం సంస్థ ఎంట్రీ లెవెల్‌ స్మాల్‌ కార్‌ ఆల్టో నుంచి ప్రీమియం మల్టీ పర్పస్‌ వాహనం ఎక్స్‌ఎల్‌6 వరకు విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి రూ. 2.89 లక్షల నుంచి రూ. 11.47 లక్షల వరకు ఉంది. 



You may be interested

బంగారానికి ‘ట్రంప్‌’ బూస్ట్‌

Wednesday 4th December 2019

వాణిజ్య యుద్ధం ముగింపు ఇప్పట్లో ఉండదన్న సంకేతాలు న్యూయార్క్‌/న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధానికి ఇప్పట్లో ముగింపు లభించే అవకాశాలు లేవన్న సంకేతాలు పసిడికి ఊతం ఇస్తున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌- నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర మంగళవారం  భారీగా పెరిగింది. ఈ వార్తరాసే రాత్రి 9గంటల సమయంలో పసిడి ధర 17 డాలర్లు పెరిగి 1,486 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెజిల్‌, అర్జెంటీనాలపై సోమవారం అమెరికా వాణిజ్య

మరిన్ని సంస్కరణలకు సిద్ధంగా ఉన్నాం

Wednesday 4th December 2019

మరిన్ని సంస్కరణలకు సిద్ధంగా ఉన్నాం భారత్‌ను పెట్టుబడులకు గమ్యస్థానం చేయడమే లక్ష్యం బ్యాంకింగ్‌, మైనింగ్‌ తదితర రంగాల్లో చర్యలుంటాయ్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ కోసం, పెట్టుబడులకు భారత్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు సహా ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నట్టు ఆమె గుర్తు చేశారు. మంగళవారం ఢిల్లీలో

Most from this category