STOCKS

News


మార్కెట్‌లోకి ఎస్‌-సీఎన్‌జీ వ్యాగన్‌ ఆర్‌!

Friday 14th February 2020
news_main1581674189.png-31799

దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సరికొత్త  ఎస్‌-సీఎన్‌జీ వ్యాగన్‌ ఆర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. BS-IV నిబంధనలకు అనుగుణంగా సీఎన్‌జీతో నడిచే విధంగా దీనిని రూపొందించారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో 10 లక్షల గ్రీన్‌ వాహనల విక్రయమే లక్ష్యంగా ఈ కారును రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మోడల్‌  ఎక్స్‌షోరూం ధరను రూ.5.25లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటిదాక మారుతీ విడుదల చేసిన BS-IV వాహనాల్లో తాజా ఎస్‌-సీఎన్‌జీ వ్యాగన్‌ ఆర్‌ మూడో వాహనం. దీనిలో 60లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ సామర్థ్యం ఉంది. దీంతో ఒక కేజీ సీఎన్‌జీ గ్యాస్‌ నింపితే 32.52 కిలోమీటర్లకు వరకు ఈ కారు దూసుకుపోతుంది. ఇంకా ఇది LXI(రూ.5.25లక్షలు), LXI (O)(రూ.5.32 లక్షలు) వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. 



You may be interested

పేజ్‌ ఇండస్ట్రీస్‌.. క్యూ3 దెబ్బ

Friday 14th February 2020

నిరుత్సాహకర ఫలితాలు 5 శాతం పతనమైన షేరు జాకీ బ్రాండ్‌ దుస్తుల కంపెనీ పేజ్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత ఆర్థిక సం‍వత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో పేజ్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం 15 శాతం క్షీణించి రూ. 87 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ లాభ మార్జిన్లు 22 శాతం నుంచి 17 శాతానికి బలహీనపడ్డాయి. అయితే మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం పెరిగి రూ. 794

రెండో రోజూ యస్‌బ్యాంక్‌ ర్యాలీ

Friday 14th February 2020

ఇంట్రాడేలో రూ.40ల స్థాయిని అందుకున్న షేరు కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని యస్‌ బ్యాంక్‌ ప్రకటనతో రెండోరోజూ ఈ బ్యాంకు షేర్ల ర్యాలీ చేశాయి. ఈ రెండు రోజుల్లో షేరు 9శాతం లాభపడింది. నేడు ఈ కంపెనీ షేరు రూ.37.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  నిధుల సమీకరణ సన్నాహాలలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలను ఈ నెల 14(శుక్రవారం)కల్లా విడుదల చేయనున్నట్లు

Most from this category