News


అమ్మకాలదే పైచేయి- నష్టాలతో షురూ

Wednesday 15th January 2020
Markets_main1579061522.png-30942

సెన్సెక్స్‌ 190 పాయింట్లు డౌన్‌
అన్ని రంగాలూ వెనకడుగు
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ ఎదురీత

వరుసగా రెండు రోజులపాటు సరికొత్త గరిష్టాలను అందుకుంటూ సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లకు బుధవారం చుక్కెదురైంది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే డీలాపడ్డాయి. సెన్సెక్స్‌ 190 పాయింట్లు క్షీణించి 41,762ను తాకగా.. నిఫ్టీ 63 పాయింట్ల వెనకడుగుతో 12,299 వద్ద ట్రేడవుతోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి నేడు ప్రాథమిక డీల్‌ కుదరనున్న నేపథ్యంలో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డోజోన్స్‌ స్వల్ప లాభాలతోనూ, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ నష్టాలతోనూ నిలిచాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. 

బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ నీరసించగా.. రియల్టీ స్వల్ప లాభంతో ఎదురీదుతోంది. మెటల్‌, బ్యాంక్‌ నిఫ్టీ, ఐటీ 1-0.5 శాతం మధ్య డీలాపడగా.. రియల్టీ 0.3 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, విప్రో, యస్‌ బ్యాంక్‌, గ్రాసిమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, వేదాంతా, అల్ట్రాటెక్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ 4-1 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఇతర బ్లూచిప్స్‌లో ఇన్‌ఫ్రాటెల్‌, టైటన్‌, హీరో మోటో, టెక్‌ మహీంద్రా, నెస్లే, ఆర్‌ఐఎల్‌ ప్రస్తావించదగ్గ స్థాయిలో 1-0.3 శాతం మధ్య బలపడ్డాయి.

ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్‌ కౌంటర్లలో శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఐడియా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌,  ఈక్విటాస్‌, డిష్‌ టీవీ, ఐబీ హౌసింగ్‌ 3.3-1.4 శాతం మధ్య నష్టపోయాయి. కాగా.. మరోపక్క మైండ్‌ట్రీ, మహానగర్‌ గ్యాస్‌, క్యాస్ట్రాల్‌, జస్ట్‌డయల్‌, ఎన్‌ఎండీసీ, ఇంద్రప్రస్థ, టైటన్‌, అమరరాజా 3-0.7 శాతం మధ్య ఎగశాయి. రియల్టీ కౌంటర్లలో ప్రెస్టేజ్‌, ఒబెరాయ్‌, ఇండియాబుల్స్‌, డీఎల్‌ఎఫ్‌ 5-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి.



You may be interested

కేన్‌ఫిన్‌, ఇండస్‌ఇండ్‌ వీక్‌- మైండ్‌ట్రీ ప్లస్‌

Wednesday 15th January 2020

వరుసగా సరికొత్త గరిష్టాలను అందుకుంటూ వస్తున్న దేశీ స్టాక్‌ మార్కెట్లకు బుధవారం అలుపొచ్చింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తుండటంతో మార్కెట్లు డీలాపడ్డాయి. ఉదయం 10 ప్రాంతం‍లో సెన్సెక్స్‌ 190 పాయింట్లు క్షీణించి 41,762ను తాకగా.. నిఫ్టీ 63 పాయింట్ల వెనకడుగుతో 12,299 వద్ద ట్రేడవుతోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి నేడు ప్రాథమిక డీల్‌ కుదరనున్న నేపథ్యంలో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగియగా..ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ

భారత్‌లోకి మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌

Wednesday 15th January 2020

ఏప్రిల్‌లో ఈక్యూసీ ఎస్‌యూవీ విడుదల పూనే: జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ మెర్సిడెస్‌ బెంజ్‌.. భారత లగ్జరీ ఎలక్ట్రిక్‌ వాహన మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌ ‘ఈక్యూ’ని మంగళవారం ఇక్కడ ప్రారంభించింది. నూతన బ్రాండ్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘ఈక్యూసీ’ పేరిట తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదలకానుందని సంస్థ ఎండీ, సీఈఓ మార్టిన్ ష్వెంక్ వెల్లడించారు. ఎలక్ట్రిక్‌కు సంబంధించిన అన్ని

Most from this category