News


నిఫ్టీ మద్దతు12,134 పాయింట్లు

Friday 14th February 2020
Markets_main1581650705.png-31776

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 18 పాయింట్లు ప్లస్‌
 ఎస్‌అండ్‌పీ స్టేబుల్‌ ఔట్‌లుక్‌ రేటింగ్‌
గురువారం యూఎస్‌ మార్కెట్లు డీలా

నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో(గ్యాపప్‌) ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30 ప్రాంతం‍లో 18 పాయింట్లు పుంజుకుని 12,192 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,174పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. విదేశీ సంస్థ ఎస్‌అండ్‌పీ.. దేశ సావరిన్‌ రేటింగ్‌ను BBB-గా కొనసాగిస్తున్నట్లు తాజాగా పేర్కొంది. స్టేబుల్‌ ఔట్‌లుక్‌ను ప్రకటించింది. ఇది ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. 

గురువారమిలా
అమెరికా స్టాక్‌ మార్కెట్లలో గురువారం మూడు రోజుల రికార్డు ర్యాలీకి బ్రేక్‌ పడింది. డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 0.5-0.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఆసియాసహా దేశీ మార్కెట్లు సైతం డీలాపడ్డాయి. ఫలితంగా మూడు రోజు ర్యాలీకి చెక్‌ పడింది. సెన్సెక్స్‌ 106 పాయింట్లు క్షీణించి 41,460 వద్ద నిలవగా.. నిఫ్టీ 27 పాయింట్లు నీరసించి 12,175 వద్ద స్థిరపడింది. ఇందుకు ఐఐపీ క్షీణించడం, రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టానికి చేరడం సైతం ప్రభావం చూపినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. నేడు తిరిగి మార్కెట్లు జోరందుకునే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,134 పాయింట్ల వద్ద, తదుపరి 12,095 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు  భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,220 వద్ద, ఆపై 12,266 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక  బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,057 పాయింట్ల వద్ద, తదుపరి 30,885 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత  31,526 పాయింట్ల వద్ద, తదుపరి 31,822 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకున్నారు. రూ. 1061 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 960 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 49 కోట్లు,  దేశీ ఫండ్స్‌ రూ. 339 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌  చేసిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 209 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 345 కోట్లవరకూ ఇన్వెస్ట్‌ చేశాయి. You may be interested

బ్యాంకింగ్‌కు మోసాల దెబ్బ రూ. 1.17 లక్షల కోట్లు!

Friday 14th February 2020

ఇండోర్‌: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు సంబంధించి 2019 ఏప్రిల్‌- డిసెంబర్‌ మధ్య జరిగిన మోసాల విలువ రూ.1.17 లక్షల కోట్లు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వెల్లడైన అంశమిది. ఆర్‌టీఐ కింద దరఖాస్తు దాఖలు చేసిన చంద్రశేఖర్‌ గౌర్‌ అనే ఒక వ్యక్తి, ఇందుకు సంబంధించి ఆర్‌బీఐ గణాంకాలను ఉటంకిస్తూ  తాజా వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం- బ్యాంకింగ్‌ మోసాల విషయంలో ఎస్‌బీఐ ముందు నిలిచింది.  బ్యాంకుల

సత్యా నాదెళ్ల భారత పర్యటన

Friday 14th February 2020

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) సత్యా నాదెళ్ల భారత్‌లో పర్యటించనున్నారు. తెలుగువాడైన నాదెళ్ల ఈ నెల 24-26 తేదీల్లో తన సొంత దేశంలో ఉండనున్నారు. కస్టమర్లు, యువ సాధకులు, విద్యార్థులు, డెవలపర్లు, టెక్‌ సంస్థల వ్యవస్థాపకులను కలిసేందుకు ఈయన భారత్‌ వస్తున్నారని ఒక ఈ-మెయిల్‌ ప్రశ్నకు కంపెనీ బదులిచ్చింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో నాదెళ్ల పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సంస్థ చీఫ్‌ హోదాలో ఇప్పటికే

Most from this category