News


నేడు నెగిటివ్‌ ఓపెనింగ్‌?!

Thursday 16th January 2020
Markets_main1579144292.png-30955

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు మైనస్‌
నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలం(నెగిటివ్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 20 పాయింట్ల  క్షీణించి 12,355 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,375 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. కాగా.. చైనాతో వాణిజ్య వివాద పరిష్కారంలో భాగంగా ప్రాథమిక దశ డీల్‌ కుదుర్చుకున్న నేపథ్యంలో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను అందుకున్నప్పటికీ చివర్లో వెనకడుగు వేశాయి. ఇక ప్రస్తుతం  ఆసియా స్టాక్‌ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. కాగా.. బుధవారం దేశీ స్టాక్‌ మార్కెట్ల రెండో రోజుల రికార్డు ర్యాలీకి బ్రేక్‌ పడింది. చివరి అర్ధగంటలో అమ్మకాలు తగ్గడంతో చివరికి స్వల్ప నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 80 పాయింట్లు క్షీణించి 41,873 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 19 పాయింట్ల వెనకడుగుతో 12,343 వద్ద ముగిసింది. దీంతో నేడు కూడా మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,296 పాయింట్ల వద్ద, తదుపరి 12,249 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు     పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,373 వద్ద, ఆపై 12,402 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,663 పాయింట్ల వద్ద, తదుపరి 31,501  వద్ద సపోర్ట్‌    లభించవచ్చని అంచనా వేశారు.  ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,994 పాయింట్ల వద్ద, తదుపరి 32,163 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

అమ్మకాలవైపు..డీఐఐలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 279 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 648 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 205 కోట్లు, డీఐఐలు రూ. 642 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.  



You may be interested

జనవరి 31 నుంచి బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల సమ్మె

Thursday 16th January 2020

బడ్జెట్‌ రోజుకూ బ్యాంకులు బంద్‌లు బ్యాంకు యూనియన్లు మరోసారి సమ్మెకు సిద్ధమయ్యాయి. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీన సమ్మె చేయాలని బ్యాంకు యూనియన్లు బుధవారం పిలుపునిచ్చాయి. భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ)తో వేతన సవరణపై చర్చలు ముందుకు సాగకపోవడంతో సమ్మెకు పిలుపునిస్తున్నామని తొమ్మిది కార్మిక సంఘాలకు ప్రాతినిధ్య వహిస్తున్న యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యుఎఫ్‌బీయూ) ప్రకటించింది. వేతన సవరణను యుఎఫ్‌బీయూ కనీసం 15 శాతం పెంపును కోరుతుంది. 12.25 శాతం వేతనాల

గ్యాస్‌ షేర్లపై క్రిడిట్‌సూసీ బుల్లిష్‌

Wednesday 15th January 2020

వచ్చే పదేళ్ళలో భారత్‌లో బలమైన గ్యాస్ డిమాండ్ నెలకొంటుందనే అంచనాలతో అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ క్రిడిట్‌సూసీ గ్యాస్‌ రంగానికి చెందిన షేర్లపై బుల్లిష్‌ దోరణి కనబరుస్తుంది. మహానగర్‌ గ్యాస్‌ షేరు షేరుకు బ్రోకరేజ్‌ సంస్థ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.1280లుగా కేటాయించింది. ఫలితంగా ఈ షేరు నేడు 6శాతానికి పైగా లాభపడింది. తక్కువ ఇన్‌పుట్‌ ధరలతో వచ్చే ఏడాది నుంచి కంపెనీ మార్జిన్లు పెరగవచ్చని బ్రోకరేజ్‌

Most from this category