News


నేడు ప్రతికూల ఓపెనింగ్‌?

Wednesday 15th January 2020
Markets_main1579058129.png-30930

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 33 పాయింట్లు మైనస్‌
నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రతికూలం(నెగిటివ్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నేటి ఉదయం 8.30 ప్రాంతం‍లో 33  పాయింట్ల క్షీణించి 12,361 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,394 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. కాగా.. చైనాతో వాణిజ్య వివాద పరిష్కార డీల్‌ నేడు కుదరనున్న నేపథ్యంలో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఇక ప్రస్తుతం ఆసియా స్టాక్‌ మార్కెట్లలో జపాన్‌, చైనా, హాంకాంగ్‌ తదితరాలు 0.5 శాతంపైగా నీరసించి కదులుతున్నాయి. కాగా.. మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు చరిత్రాత్మ గరిష్టాల వద్ద నిలిచాయి. సెన్సెక్స్‌ 93 పాయింట్లు పెరిగి 41,953 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 33 పాయింట్లు పుంజుకుని 12,362 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సైతం సెన్సెక్స్‌ 41,994 వద్ద, నిఫ్టీ 12,374 వద్ద సరికొత్త గరిష్ట రికార్డులను నెలకొల్పాయి. దీంతో నేడు కొంతమేర లాభాల స్వీకరణకు వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,323 పాయింట్ల వద్ద, తదుపరి 12,283 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు    పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,388 వద్ద, ఆపై 12,414 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,975 పాయింట్ల వద్ద, తదుపరి 31,879  వద్ద సపోర్ట్‌   లభించవచ్చని అంచనా వేశారు.  ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 32,182 పాయింట్ల వద్ద, తదుపరి 32,293 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

అమ్మకాలవైపు..
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 205 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 642 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 68 కోట్లు, డీఐఐలు రూ. 47 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.  



You may be interested

విప్రో లాభం రూ.2,456 కోట్లు

Wednesday 15th January 2020

2 శాతం క్షీణత  3 శాతం పెరిగిన ఆదాయం  ఒక్కో షేర్‌కు రూ. 1 డివిడెండ్‌  న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.2,456 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.2,510 కోట్లు)తో పోల్చితే 2 శాతం క్షీణించిందని  విప్రో సీఈఓ, ఎమ్‌డీ అబిదాలి జడ్‌ నీముచ్‌వాలా తెలిపారు. ఆదాయం మాత్రం రూ.15,060 కోట్ల నుంచి 3 శాతం

బాగా పడిన ఈ స్టాక్స్‌లో ఏవి నయం?

Tuesday 14th January 2020

గతేడాది మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో చాలా వరకు ఇన్వెస్టర్ల పెట్టుబడులను హరించివేసినవే. గత నెల రోజులుగా ఈ విభాగాల్లోని ‍స్టాక్స్‌లో కదలిక వచ్చింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, ‍స్మాల్‌క్యాప్‌లో 14 స్టాక్స్‌ వాటి ఏడాది గరిష్ట ధరల నుంచి 30-73 శాతం వరకు నష్టపోయాయి. ఆ స్టాక్స్‌ ఏవి, వాటిల్లో పెట్టుబడులను పరిశీలించొచ్చా..? అన్నదానిపై నిపుణుల అభిప్రాయాలను చూద్దాం..   52 వారాల గరిష్ట స్థాయిల నుంచి హెచ్‌ఈజీ షేరు 73 శాతం తక్కువలో

Most from this category